ఐకాన్ స్టార్ తాజాగా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలిశారు. ఐపీఎల్‌(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న అయ్యర్‌ను బన్నీ అభినందించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడిన వెంకటేష్ అయ్యర్‌.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అల్లు అయాన్‌కు అయ్యర్ ఓ గిఫ్ట్ అందించారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో వెల్లడించారు. అల్లు అయాన్‌కు అయ్యర్ గిఫ్ట్...అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్ లలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. ఆర్సీబీ ఫ్యాన్ అయిన అయాన్.. గతంలో తన ఫేవరేట్ టీమ్ ఐపీఎల్‌ లో ఓడిపోయిందని ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు RCB తరపున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. అయాన్ కోసం బహుమతిని తీసుకొచ్చారు. తన సైన్‌తో కూడిన స్పెషల్ ఆర్సీబీ జెర్సీని అందించారు. కొడుకు కోసం స్టార్ క్రికెటర్ ఇచ్చిన ఈ గిఫ్ట్‌పై బన్నీ సంతోషం వ్యక్తం చేశారు."ఈ రోజు ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని కలవడం ఎంతో ఆనందంగా అనిపించింది. అల్లు అయాన్‌కు ప్రత్యేకంగా సంతకం చేసిన జెర్సీని బహూకరించినందుకు ఆయనకు నా స్పెషల్ థ్యాంక్స్. ఆయన ఫ్యూచర్ ఎండీవర్స్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని అల్లు అర్జున్ ఎక్స్ లో పేర్కొన్నారు. వెంకటేష్ అయ్యర్‌తో దిగిన ఫొటోలను ఫోటోలను పంచుకున్నారు. ఇందులో అయ్యర్ చేతుల మీదుగా ఆర్సీబీ జెర్సీని అందుకున్న అల్లు అయాన్ మురిసిపోతూ కనిపించాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్పరాజ్ గా ఆయన నటనకు, డ్యాన్స్ లకు, డైలాగులకు అందరూ ఫిదా అయ్యారు. సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేశారు. దీంతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరైన అల్లు అర్జున్.. టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌తో కలిసి కనిపించడంతో సినీ ప్రియులు, క్రికెట్ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినీ, క్రికెట్ కలయికలో వచ్చిన ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.