ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) దుమ్మురేపుతోంది. ఐపీఎల్‌ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు చాలా కిక్ ఇస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లగా.. మిగిలిన స్థానం కోసం 4 జట్లు పోటీలో ఉన్నాయి. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు (హెచ్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ తరహాలోనే తెలంగాణలో టీజీపీఎల్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, వరంగల్ సహా మొత్తం 8 టీమ్‌లను ఏర్పాటు చేసింది. టీజీ20 లీగ్‌ జూన్‌ 20వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లను ఏర్పాటు చేయగా.. అందులో హైదరాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ టీమ్‌లు ఈ పోటీ పడనున్నాయి. జూన్‌ 20వ తేదీన తొలి మ్యాచ్‌ జరగనుండగా.. ఫైనల్‌ జూలై 11వ తేదీన ఫైనల్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే టీజీ20 టీమ్‌ల బిడ్‌లను కూడా హెచ్‌సీఏ తెరిచింది. ఇక ఈ లీగ్‌లో ఆడే క్రికెటర్లకు సంబంధించిన వేలాన్ని జూన్‌ 7వ తేదీ నిర్వహించనుంది.టీమ్‌లు.. సొంతం చేసుకున్న యాజమాన్యాలుహైదరాబాద్‌- రూ.7.5 కోట్లు- ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌రంగారెడ్డి- రూ.7.2 కోట్లు- బూరుగు ఇన్‌ఫ్రా, ప్రణవవరంగల్‌- రూ.6.55 కోట్లు- బైన్‌ గ్లోబల్‌ రిసోర్సెస్‌మెదక్‌- రూ.6.33 కోట్లు- బృందా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌నల్గొండ- రూ.5.06 కోట్లు- కిశోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌కరీంనగర్- రూ.4.57 కోట్లు- ఈఐపీఎల్‌ గ్రూప్‌, తిబరుమాల్‌మహబూబ్‌నగర్- రూ.4.5 కోట్లు- వీరభద్ర స్టీల్స్‌ఖమ్మం- రూ.4.44 కోట్లు- అన్విత గ్రూప్‌ అయితే ఈ టీజీ20 లీగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎలా నిర్వహిస్తారు.. ఎక్కడ నిర్వహిస్తారు.. ఏ ఏ ప్లేయర్లను తీసుకుంటారు.. ఈ లీగ్‌ లో గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు అనే విషయాలు వెల్లడించాల్సి ఉంది.