ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. చమురు దిగుమతుల కోసం భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తుండటంతో.. ప్రధాని ఈ విధంగా పిలుపునిచ్చారు. అంతే కాదు తన కాన్వాయ్ పరిమాణాన్ని సైతం మోదీ తగ్గించుకున్నారు. స్వయంగా ప్రధాన మంత్రే ఇంధన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టడంతో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా ప్రజాప్రతినిధులందరూ పొదుపు బాట పట్టారు. అందులో భాగంగా కొందరు తమ కాన్వాయ్ సైజ్ తగ్గించుకుంటే.. కొందరు ప్రజా రవాణాను ఆశ్రయించారు.ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా చాలా మంది నేతలు ఎలక్ట్రిక్ కార్ల వాడకం వైపు మళ్లుతున్నారు. ప్రధాని పిలుపుతో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, . అలాగే టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గమైన కోవూరులో ఎంఎస్‌ఎంఈ పార్కు సందర్శనకు ఎలక్ట్రిక్ కార్లో వెళ్లారు. ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్.భీమవరంలో ఏర్పాటు కానున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కుకు చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ పార్కు ద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.ఇంధనం పొదుపు చేస్తున్నానని పార్టీ పెద్దలు, తన అభిమానులకు సంకేతాలు ఇవ్వడం కోసం ప్రశాంతి రెడ్డి ఎలక్ట్రిక్ కార్లో వెళ్లిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి మరో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఆంధ్రాలో లబ్ధి పొందుతూ పక్క రాష్ట్రంలో కారు కొన్నారు, అక్కడే ట్యాక్స్ కట్టారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ టీజీ 09తో ప్రారంభం కావడంతో ఇలా కామెంట్ చేస్తున్నారు.ప్రశాంతి రెడ్డి దగ్గర ఉన్నది ఖరీదైన బీఎండబ్ల్యూ ఈవీ కారు కావడంతో.. మీరు కొత్త లగ్జరీ కారు కొనుక్కోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ దేనికి అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పోస్టు చేస్తే ఎమ్మెల్యేకు అడ్వాంటేజ్‌గా ఉండాలి కానీ.. ఇలా ఉండకూడదు.. బాబూ అడ్మిన్ చూసుకో అని మరో నెటిజన్ సాఫ్ట్‌గానే చురకలు అంటించారు. ఆంధ్రా ఎమ్మెల్యే రూ.2 కోట్లు పెట్టి తెలంగాణలో కారు కొన్నారు.. తెలుగుదేశం ఏపీ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుతుంది అంటూ టీడీపీని ట్యాగ్ చేసి మరీ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే మేడమ్‌కు అడ్మిన్ ఎలివేషన్ ఇవ్వబోతే.. అది కాస్తా బెడిసికొట్టింది. దీంతో అందరూ కామెంట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా అడ్మిన్ ఆ పోస్టుకు సెట్టింగ్స్ మార్చేశాడు.ఏపీలో చాలా మంది నేతలు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. దీంతో వాహనాలను కూడా అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేసింది తప్పేమీ కాదు. కాకపోతే మన రాష్ట్రంలో కొనుకోవచ్చు కదా అనేది సగటు ఆంధ్రుడి ప్రశ్న, ఆవేదన కూడానూ.