ఏపీలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు, ఎన్ని రోజులంటే!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌ బాషా జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కాలేజీలు జూన్‌ ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉంది.. అయితే జూన్ 1 కాకుండా 6వ తేదీకి మార్పు చేశారు. జూన్‌ ఐదో తేదీ వరకు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేశారు. జూన్ 6 నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభించాలని ఉత్తర్వుల్లో సూచించారు. అయితే అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు ఈ మార్పును గమనించాలని సూచించారు. అంతేకాదు ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విద్యార్థులకు అదనంగా మరో ఐదు రోజుల పాటూ సెలవులు అదనంగా వచ్చాయి. ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తికాకపోవడంతో సెలవుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సెలవులు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య కోసం 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటికే NCERT సిలబస్, CBSE విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 232 పనిదినాలు ఉంటాయి.ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లను విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యా శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ (ఎస్‌ఎంసీ) కమిటీల్లో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించింది. 'రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 12 నుంచి 25 మంది సభ్యులను ఎస్‌ఎంసీలో ఎన్నుకోవాలి. వీరిలో 75% మంది విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండాలి. మిగతా 25%లో స్థానిక సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులను నియమించాలి. మొత్తం ఎస్‌ఎంసీ సభ్యుల్లో 50% మహిళలు ఉండాలి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దామాషా ప్రకారం కేటాయించాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్య కన్వీనర్‌గా ఉంటారు.. నెలకు ఒకసారి కొత్త ఎస్‌ఎంసీల సమావేశాలు నిర్వహించాలి' అని సూచించింది.