ఐపీఎల్ 2026లో ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయమనే చెప్పొచ్చు. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టగా.. ఈ రోజు జరిగే మ్యా‌చ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2కు వెళ్లనుంది. ఆర్సీబీపై ఓడిన గుజరాత్.. ఈ రోజు గెలిచే జట్టు కలిసి క్వాలిఫైయర్ 2 ఆడనుంది. ఐపీఎల్ ఎలిమినేటర్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తమ బ్యాటింగ్ డామినేషన్‌తో ప్లే ఆఫ్స్‌కు ఈజీగా అర్హత సాధిస్తే, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇరు జట్లు తమ తమ బ్యాటింగ్ బలాలతో పాటు బౌలింగ్‌లోనూ సరిసమానంగా ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ 23 మ్యాచ్‌లలో ఆడాయి. అందులో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 మ్యాచ్‌లలోనే గెలిచింది. ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్య విజయం సాధించడం విశేషం. దాంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్ / ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ, షాకీబ్ హుస్సేన్. రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనాయశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), దాసున్ శనక, డొనోవాన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, శుభమ్ దూబే, రవీంద్ర జడేజా / రవి బిష్ణోయ్, బర్గర్, యశ్ రాజ్, బ్రిజేశ్ శర్మ.