8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్.. ఉద్యోగులతో వరుస భేటీలు.. జూన్, జూలై షెడ్యూల్ విడుదల!

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ సెంట్రల్ పే కమిషన్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఒడిశాలోని భువనేశ్వర్ సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా 8వ సీపీసీ విడుదల చేసింది. వచ్చే జూలై 6వ తేదీ, జూలై 7వ తేదీ రెండు రోజుల పాటు భువనేశ్వర్‌కు 8వ పే కమిషన్ సభ్యులు రానున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్గనైజేషన్లు, ఇన్‌స్టిట్యూషన్లు, యూనియన్లు, అసోసియేషన్ల సభ్యులతో భేటీ కానున్నట్లు తెలిపింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఒడిశాలోని భుననేశ్వర్ సమావేశాలకు ఎవరు హాజరుకావచ్చనే విషయంపై మే 26, 2026న జారీ చేసిన అధికారిక నోటీసులో 8వ సీపీసీ వెల్లడించింది. 'భువనేశ్వర్ పర్యటన సందర్భంగా 8వ పే కమిషన్‌తో సమావేశం కావాలనుకుంటున్న ఉద్యోగ సంఘాల సభ్యులు అపాయింట్‌మెంట్ కోసం 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారంతా మే 31, 2026లోపు తమ అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సమావేశాలకు రావాలనుకుంటున్న ఉద్యోగుల, ఉద్యోగ సంఘాలు అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందే తమ ప్రతిపాదనలతో మెమోరండం సబ్మిట్ చేసి యూనిక్ మెమో ఐడీ పోదాలి. దానిని అపాయింట్‌మెంట్ అప్లికేషన్‌తో సబ్మిట్ చేయాలి' అని 8వ పే కమిషన్ స్పష్టం చేసింది. జూన్ 2026 షెడ్యూల్ ఇదిఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 4, 2026 వరకు వరుస భేటీలు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే జూన్ 8, 2026 రోజున కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సమావేశం కానున్నట్లు తెలిపింది. ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆసక్తి ఉన్న ఉద్యోగ సంఘాలు, యూనియన్లు నిర్దేశిత గడువులోపు ఆన్‌లైన్ ద్వారా అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల నిర్మాణం, అలవెన్సులు, పింఛను ప్రయోజనాలను సమీక్షించడానికి భారత ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫార్సులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేసిన వారిపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. 8వ పే కమిషన్‌ 18 నెలల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 8వ సీపీసీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను 2025, నవంబర్‌లో విడుదల చేశారు. దీని ప్రకారం దేశీయ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల సంక్షేమ అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న నిధులు, పెన్షన్ పథకాలతో ఎదురవుతున్న భారం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితుల ప్రభావం, ప్రస్తుత వేతన విధానం, సర్వీస్ కండీషన్స్, ఉద్యోగుల ప్రయోజనాల వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక సమర్పించనున్నారు.