: పెట్టుబడుల కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వల్ల అతిపెద్ద బెనిఫిట్ ఉంటుంది. కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ. అంటే వడ్డీపై వడ్డీ వస్తుంది. దీని వల్ల క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతూ పోతే.. కాలం గడుస్తున్న కొద్దీ సంపద అలా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో లంప్ సమ్ పెట్టుబడులు పెట్టొచ్చు.. లేదా సిప్ రూపంలో నెలనెలా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. చాలా మంది చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చన్న ఆలోచనతో సిప్ పెట్టుబడులవైపు మొగ్గుచూపుతుంటారు. ఇక్కడ కనీసం నెలకు రూ. 100 నుంచి కూడా సిప్ పెట్టుబడి ప్రారంభించొచ్చు. గరిష్ఠ పరిమితి కూడా ఉండదు. ఎవరి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వారు పెట్టుబడి, కాల పరిమితి ఎంచుకోవచ్చు. ఐదేళ్లు, పదేళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు ఇలా వారి వారి స్థోమతకు తగ్గట్లుగా పెట్టుబడులు చేసేందుకు వీలుంటుంది. ఇక నెలకు రూ. 10 వేల చొప్పు సిప్ చేస్తే మీ చేతికి ఒకేసారి 15 ఏళ్లలో రూ. 1 కోటి వస్తే ఎలా ఉంటుంది. ఇది సాధ్యం కాదనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్లలో ఏదైనా సాధ్యమే. నెలనెలా రూ. 10 వేలు సిప్ చేసిన వారికి 15 ఏళ్లలో రూ. 1.20 కోట్ల వరకు అందించిన స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి రిటర్న్స్ గత 15 ఏళ్లలో కేవలం 2 స్కీమ్స్ ఇచ్చాయి. ఆ స్కీమ్స్ గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవే , . ఇవి వార్షిక ప్రాతిపదికన సగటున ఏకంగా 20 శాతానికిపైగా రిటర్న్స్ అందించడంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిందని చెప్పొచ్చు. 15 ఏళ్లకు నిప్పన్ ఇండియా స్కీంలో సగటున వార్షికంగా 22.58 శాతం రిటర్న్స్ అందగా.. నెలకు చేసిన వారికి ఒకేసారి రూ. 1.20 కోట్లు వచ్చాయి. అదే ఎడెల్‌వీజ్ మిడ్ క్యాప్ స్కీంలో అయితే 20.19 శాతం వార్షిక రిటర్న్స్ అందగా.. రూ. 10 వేల సిప్‌ను రూ. 97 లక్షలుగా మలిచింది. అంటే ఇక్కడ కూడా రమారమి రూ. కోటి వరకు రాబడి వచ్చింది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 2010 సెప్టెంబరులో లాంఛ్ అయింది. ఇది ఓపెన్ ఎండెడ్ స్మాల్ క్యాప్ కేటగిరీ ఫండ్. ఎక్కువగా స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 72,673 కోట్లుగా ఉంది. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫండ్‌గా ఉంది. ఎక్కువగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంసీఎక్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, అపార్ ఇండస్ట్రీస్, టీడీ పవర్ సిస్టమ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసింది. ఎడెల్‌వీజ్ ఫండ్ విషయానికి వస్తే ఇది 2007 డిసెంబరులో లాంఛ్ అయింది. ఇది ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. దీని నిర్వహణలోని ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 15,911 కోట్లుగా ఉంది. దీని టాప్ స్టాక్ హోల్డింగ్స్ చూస్తే ఎంసీఎక్స్, ఫెడరల్ బ్యాంక్, బీఎస్ఈ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మారికో వంటివి ఉన్నాయి. Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.