LIC నుంచి మరో 2 కొత్త పథకాలు.. ఒకే ప్లాన్‌తో 'భార్యాభర్తలిద్దరికీ' బీమా..న్యూ జీవన్ సాతి జాయింట్ లైఫ్ ప్లాన్స్ ప్రయోజనాలివే!

Wait 5 sec.

LIC New Plans: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రెండు కొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్స్ లాంచ్ చేసింది. జీవిత బీమా రక్షణతో పాటు పొదుపు అందించేలా ఈ కొత్త పాలసీలను రూపొందించినట్లు తెలిపింది. అవే ఎల్ఐసీ న్యూ జీవన్ సాతి సింగిల్ ప్రీమియం ప్లాన్ (), ఎల్ఐసీ న్యూ జీవన్ సాతి లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ ( Limited Premium Plan). ఒకే పాలసీ ద్వారా దీర్ఘకాలంలో సేవింగ్స్, ఆర్థిక భద్రత కావాలని కోరుకునే న్యూ జీవన్ సాతి జాయింట్ లైఫ్ ప్లాన్స్ నాన్- పార్టిసిపేట్, నాన్ మార్కెట్ లింక్డ్, గ్యారెంటీడ్ అడిషన్స్, ఫిక్స్‌డ్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. పాలసీదారులకు గ్యారెంటీ రిటర్న్స్ లభిస్తాయి. దీర్ఘకాలంలో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, పొదుపు ఉంటుంది. ఈ క్రమంలో ఈ ప్లాన్స్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఎల్ఐసీ న్యూ జీవన్ సాతి (సింగిల్ ప్రీమియం) ప్లాన్ఎల్ఐసీ కొత్తగా లాంచ్ చేసిన జాయింట్ ప్లాన్లలో న్యూ జీవన్ సాతి సింగిల్ ప్రీమియం ప్లాన్ ఒకటి. ఇది నాన్ పార్టిసిపేట్, నాన్ లింక్డ్, లైఫ్, ఇడివిడ్యువల్, సేవింగ్స్ ప్లాన్. ఇది ఒక జాయింట్ లైఫ్ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్. ఇందులో గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి. ఈ ప్లాన్ అనేది సేవింగ్స్, ప్రొటెక్షన్ కలయికతో వస్తోంది. ఇది నాన్ పార్టిసిపేటివ్ ప్రొడక్ట్ కాబట్టి పాలసీదారు మరణించినా లేదా జీవించి ఉన్నా గ్యారెంటీగా, ఫిక్స్‌డ్ బెనిఫిట్స్ లభిస్తాయి. అందువల్ల, ఈ పాలసీకి బోనస్ లేదా మిగులులో వాటా వంటి ఎలాంటి విచక్షణాపరమైన ప్రయోజనాలకు అర్హత లేదు.కీ ఫీచర్స్ ఇవే: వన్-టైమ్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పెళ్లయిన వ్యక్తితో పాటు అతని జీవిత భాగస్వామికీ బీమా కవరేజీ లభిస్తుంది. ప్రతి రూ.1000 సమ్ అష్యూర్డ్ కు రూ.70 చొప్పున గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి. డెత్ బెనిఫిట్ ఆప్షన్స్, పాలసీ టర్మ్‌లో ఏది కావాలో ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్స్ ఇన్‌స్టాల్మెంట్లుగా వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. హై సమ్ అష్యూర్డ్ రిబేట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాలసీదారు, నామినీకి రిబేట్ లభిస్తుంది. ఈ పాలసీపై లోన్ సౌకర్యం సైతం లభిస్తుంది.ఎల్ఐసీ న్యూ జీవన్ సాతి (లిమిటెడ్ ప్రీమియం) ప్లాన్నాన్ లింక్డ్, లైఫ్, ఇండివిడ్యూవల్, సేవింగ్స్ ప్లాన్. ఇది ఒక జాయింట్ లైఫ్ లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్. ఇందులోనూ గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి. ఈ ప్లాన్ సైతం సేవింగ్స్ ప్లస్ ప్రొటెక్షన్ బెనిఫిట్స్ లభిస్తాయి. పాలసీదారు మరణించినా, జీవించి ఉన్నా అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. అందువల్ల, ఈ పాలసీకి బోనస్ లేదా మిగులులో వాటా వంటి విచక్షణాపరమైన ప్రయోజనాలకు అర్హత ఉండదు. కీ ఫీచర్స్: జాయింట్ లైఫ్ ప్లాన్ ద్వారా పెళ్లయిన వ్యక్తి, అతని జీవిత భాగస్వామికి కవరేజీ ఇస్తుంది. ప్రీమియం పేమెంట్ చేసే టర్మ్‌లో మరణిస్తే ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. 7 శాతం రేటుతో గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి. రెండు డెత్ బెనిఫిట్స్ ఆప్షన్స్ నుంచి కావాల్సిన రిస్క్ కవరేజీ ఎంచుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్, పాలసీ టర్మ్ ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్స్ విడతల వారీగా పొందవచ్చు. హై బేసిక్ సమ్ అష్యూర్డ్ పై ఆకర్షణీయమైన ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పాలసీదారు, నామినీ, మరణించిన పాలసీదారు బెనిఫీషియరీలకు రిబేట్ లభిస్తుంది.