ఇరాన్ యుద్ధంతో భారత్‌లో సంక్షోభం! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. వారికి హెచ్చరిక

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో భారత్ వంటి దేశాలకు తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆయిల్, ఎరువులు, విదేశీ మారకం నిల్వలపై ప్రత్యేక దృష్టి పెచ్చాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. ప్రజలకు సూచించారని అన్నారు. అయితే, దేశ ఆర్థిక పరిస్థితిపై నిరాశావాదం వ్యాప్తికి కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముంబైలో జరిగిన సిడ్బీ (SIDBI) వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా భయపెట్టే ప్రచారం చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇందనం, ఎరువులు, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఈ మూడింటి కోసం డాలర్ల రూపంలోనే పేమెంట్లు చేయాల్సి ఉంటుందని, విదేశీ మారకం తరిగిపోకుండా ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. దేశీయంగా వృద్ధికి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతోనే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైంజ్ సుంకాలను తగ్గించామని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నామని చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల నేపథ్యంలో 3 ఎఫ్‌లపై (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్) ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పౌరులకు సూచించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు నిరాశవాదులు దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందన్న స్థాయిలో ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం సరికాదని వారిని హెచ్చరించారు. ప్రజలకు చేసే మంచిని విస్మరించి లేనిపోని ప్రచారాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు బాహ్య కారకాలే కారణమన్న సంగతి విస్మరించొద్దని చెప్పారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి, భయాందోళన కల్పించడం సరికాదని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చమురు సరఫరా ఆగిపోయింది. దీంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారత్ సైతం ఇంధన కొరత ఎదుర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణాను ఉపయోగించాలని పలు సూచనలు చేశారు. ముందు ముందు పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలిపారు. దీంతో తాజాగా ఈ విషయంపై ఆర్థిక మంత్రి మాట్లాడారు.