లక్షకు రూ. 15 లక్షలొచ్చాయ్.. హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్ సహా 7 ఫండ్స్.. ఓపికతో చూస్తే కాసులు కురిపించాయ్!

Wait 5 sec.

: చాలా మంది దీర్ఘకాలంలో పెట్టుబడుల కోసం రిస్క్ ఉన్నా సరే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తుంటారు. ఇక్కడ లాంగ్ రన్‌లో చాలా వరకు మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతుంటారు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ప్రయోజనం కారణంగా సంపద కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ.. వైవిధ్యం కారణంగా మరీ ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఇక్కడ లంప్ సమ్ రూపంలో ఒకేసారి పెట్టుబడి పెట్టొచ్చు లేదా సిప్ రూపంలో నెలనెలా కూడా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. కొందరు స్కీంను బట్టి ఇన్వెస్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం గత చరిత్ర ఆధారంగా పెట్టుబడులు పెడుతుంటారు. ఓపికతో దీర్ఘకాలం ఎదురుచూస్తే మంచి లాభాలు ఆశించవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లలో గత 20 ఏళ్ల వ్యవధిలో అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన టాప్- 7 స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో లార్జ్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ ఉండగా.. ఇన్వెస్టర్ల సంపదను గరిష్ఠంగా 17 రెట్ల వరకు పెంచేశాయి. వీటిల్లో స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో ఇన్వెస్టర్ల సంపదను 12.3 రెట్లు పెంచింది. ఇక్కడ లక్ష పెట్టుబడిని రూ. 12.30 లక్షలు చేసింది. ఇక్కడ వార్షికంగా 13.3 శాతం CAGR చొప్పున రిటర్న్స్ అందాయి. హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్ చూస్తే 20 ఏళ్లలో 11.1 రెట్ల మేర సంపద పెంచగా.. లక్షను రూ. 11.1 లక్షలు చేసింది. ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ చూస్తే 13.1 రెట్ల మేర సంపద పెంచింది. ఇక్కడ లక్షకు రూ. 13.1 లక్షలు వచ్చాయి. నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ అత్యధికంగా ఇన్వెస్టర్ల సంపదను 20 ఏళ్ల కాలంలో 17.1 రెట్లు పెంచింది. ఇక్కడ లక్ష పెట్టుబడిపై రూ. 17 లక్షలు వచ్చాయి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 11.5 రెట్ల మేర రాబడి అందించగా.. లక్షకు రూ. 11.5 లక్షలు వచ్చాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లక్షను రూ. 13.2 లక్షలుగా మలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లక్షను 20 ఏళ్ల కాలంలో రూ. 15 లక్షలు చేసింది. 15 ఏళ్ల కాలంలో చూస్తే ఈ 7 ఫండ్స్.. 10 రెట్ల వరకు రాబడి అందించగా.. పదేళ్ల వ్యవధిలో 5.7 రెట్ల వరకు రిటర్న్స్ ఇచ్చింది. ఇక మూడు కాల వ్యవధుల్లో నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ టాప్ పెర్ఫామర్‌గా నిలిచింది.