గుజరాత్ ఆయువు పట్టు ఆ ముగ్గురే.. ఆర్సీబీ వాళ్లపై గురి పెడితే ఇక ఖేల్ ఖతమే!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో అసలైన పోరు ఇప్పుడు నుంచే మొదలైంది. ప్లే ఆఫ్స్‌లో భాగంగా . ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది నేరుగా ఫైనల్‌కి వెళ్లనుంది. దాంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే, ఆర్సీబీ మాత్రం గుజరాత్ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా సీజన్ మధ్య నుంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో హ్యాట్రిక్ సాధించింది. ఆ వెంటనే రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. అంటే తొలి ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లే విజయం సాధించింది. సెకండ్ హాఫ్‌లో రెచ్చిపోయిన గుజరాత్ ఏడు మ్యాచ్‌లలో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ విజయాల్లో ఓ ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు , , ఫస్ట్ డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్. ఈ ముగ్గురూ గుజరాత్‌ను క్వాలిఫైయర్ 1కి చేర్చడంలో కీలకంగా నిలిచారు. ఇప్పుడు ఆర్సీబీ ఈ ముగ్గురిపైనే గురి పెట్టింది. ఈ ముగ్గుర్ని త్వరగా అవుట్ చేయగలిగితే ఆర్సీబీ విజయాన్ని తమ చేతుల్లోకి తీసుకోగలదు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. సాయి సుదర్శన్ 14 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలతో 638 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 13 ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలతో 616 పరుగులు నమోదు చేశాడు. వీళ్లిద్దరితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా నాలుగు హాఫ్ సెంచరీలతో 469 పరుగులు చేయడం విశేషం. పవర్ ప్లేలోనే ఈ ముగ్గురి ఆటగాళ్లను బయటకు పంపాలని ఆర్సీబీ చూస్తోంది. తమ కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేయించి ముఖ్యంగా ఓపెనర్ల పార్ట్‌నర్‌షిప్ దెబ్బతీయగలిగితే ఆర్సీబీ సక్సెస్ సాధించినట్టే. మరోవైపు గుజరాత్ కూడా తమ బౌలింగ్‌తో ఆర్సీబీని దెబ్బతీయాలని చూస్తోంది.