RCB ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. డేంజరస్ ఫిల్ సాల్ట్ లేకుండానే క్వాలిఫైయర్ 1?

Wait 5 sec.

ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1కి అంతా సిద్ధమైంది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ రసవత్తర పోరుకు రెడీ అయ్యాయి. అయితే, ఈ మ్యాచ్‌కి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను కలవరపెట్టే వార్త ఒకటి వినిపిస్తోంది. డేంజరస్ లేకుండానే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతన్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో ఫిల్ సాల్ట్ పాత్ర చాలా కీలకం. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్‌లో ఆర్సీబీ ఏడు మ్యాచ్‌లలో రెండు మాత్రమే ఓడి, ఐదు మ్యాచ్‌లలో గెలిచింది. ఆ తర్వాత ఏడు మ్యాచ్‌లలో మూడు ఓడింది. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ కూడా చాలా బాగా ఉంది. ఆ తర్వాత ఏడు మ్యాచ్‌లలో తొలి వికెట్ భాగస్వామ్యం తక్కువ పరుగులకే పరిమితమైంది. ఎందుకంటే, తొలి ఏడు మ్యాచ్‌లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ క్రీజులో ఉండటమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాల్ట్ మ్యాచ్‌లో ఉంటే బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆర్సీబీ చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. అయితే, గాయం కారణంగా సీజన్ సగం నుంచి దూరమైన సాల్ట్.. లీగ్ స్టేజ్ వరకూ మళ్లీ అడుగుపెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన జేకబ్ బెతెల్ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే, ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఫిల్ సాల్ట్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫైయర్ 1లో ఆడే అవకాశం చాలా తక్కువగా ఉందని కెప్టెన్ రజత్ పటిదారే నేరుగా చెప్పాడు. "ఫిల్ సాల్ట్ ఫిట్‌గా ఉన్నప్పటికీ ఇంకా డాక్టర్ అజ్జర్వేషన్‌లోనే ఉన్నాడు. అతను ఇంకా కొన్ని డ్రిల్స్ చేయాల్సి ఉంది. దాంతో అతన్ని ప్లేయింగ్ 11లో ఇప్పుడల్లా ఆడించలేము. సాల్ట్ ప్లేయింగ్ 11లో ఉంటాడా? లేదా? అన్నది వికెట్‌ని బట్టి డిసైడ్ అవుతాము" అని రజత్ పటిదార్ అన్నాడు. ఈ సీజన్‌లో కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఫిల్ సాల్ట్ 202 పరుగులు చేశాడు. 78 హైయెస్ట్‌తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. సాల్ట్ ఒకవేళ మ్యాచ్‌లో ఆడకపోతే ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్‌నే ఆర్సీబీ మేనేజ్‌మెంట్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనావెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ దార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ / జేకబ్ డప్ఫీ.