జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా..

Wait 5 sec.

రైల్వే కోడూరు జన సేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఇటీవలి కాలంలో పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఓ వివాహిత మహిళ అరవ శ్రీధర్ మీద చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీనిపై జనసేన విచారణ కమిటీని ఏర్పాటు చేయగా.. అరవ శ్రీధర్ తన వివరణ కూడా తెలియజేశారు. అయితే ఆ తర్వాత కూడా బాధితురాలు మరిన్ని వీడియోలు విడుదల చేయటం.. వివిధ అంశాలలో అరవ శ్రీధర్ మీద ఆరోపణలు రావటంతో ఆయన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపించారు.