ప్రభుత్వ బ్యాంకులో కేంద్రం వాటా విక్రయం.. తొలిరోజే ఎగబడ్డ ఇన్వెస్టర్లు.. అమ్మకానికి మరో 4 శాతం వాటా!

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు పలు ప్రభుత్వ సంస్థల్లో తమ వాటాల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన . శుక్రవారం రోజే నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఇన్వెస్టర్ల నుంచి ఊహించని స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో అదనంగా వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. ముందుగా 4 శాతం వాటానే విక్రయించాలని నిర్ణయించి.. మరో 4 శాతం గ్రీన్ షూ ఆప్షన్ లేదా ఓవర్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కింద ఉంచింది. ఇప్పుడు మంచి రెస్పాన్స్ లభించగా.. మిగతా 4 శాతం వాటాను కూడా ఓఎఫ్ఎస్ కింద విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.ముందుగా శుక్రవారం రోజు నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించేందుకు ఓఎఫ్ఎస్ లాంఛ్ చేసింది. ఇక్కడ మొత్తంగా 32.58 కోట్ల షేర్లను రిజర్వ్ చేయగా.. ఇలా అందుబాటులో ఉన్న షేర్లు 2 రెట్లకు మించి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 76.86 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి.గురువారం రోజు క్లోజింగ్ ధర రూ. 33.92 తో చూస్తే చాలా తక్కువ ధరకే రూ. 31 నే ఫ్లోర్ ధరగా నిర్ణయించింది. అంటే మార్కెట్లో ఉన్న ధర కంటే కాస్త తక్కువకే షేర్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. వాటా విక్రయం నేపథ్యంలో శుక్రవారం సెషన్‌లో మాత్రం షేరు ధర దాదాపు 8 శాతం తగ్గి రూ. 31.22 వద్ద స్థిరపడింది.శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు కాబట్టి ఓఎఫ్ఎస్ ఉండదు. కాబట్టి.. మళ్లీ సోమవారం రోజు (మే 25) రెగ్యులర్‌ ఇన్వెస్టర్లు లేదా రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులో ఉంటుంది. వారు సోమవారం రోజు షేర్లకు బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ముందుగా 4 శాతం వాటాకు సమానమైన 36.20 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. ఇప్పుడు మరో 4 శాతం అంటే మొత్తంగా 72.41 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచుతుందన్నమాట.