‘అమ్మిలందరూ తట్టుకోండి.. మనోడు వస్తున్నాడురోయ్’.. అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ రిలీజ్‌!

Wait 5 sec.

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. , సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మరో నెల రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రచారంలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లెనిన్’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ''ఈరోజు మే 23 నా సినీ జీవితం మొదలైన రోజు. అఖిల్ నాకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరు చూడండి. మనోడు వస్తున్నాడు'' అని నాగ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. స్టేజ్ మీద నాటకాల్లో భాగంగా 'ఆచార్య దేవా..ఏమంటివి ఏమంటివి' అంటూ సీనియర్ ఎన్టీఆర్ శక్తివంతమైన డైలాగ్‌లను భాగ్యశ్రీ బోర్సే చెప్పడం.. 'ఎన్టీఆర్ అంత గొప్పగా కాకపోయినా నువ్వూ బాగానే చెప్పినావ్ లే' అని అఖిల్ చెప్పే బ్యూటిఫుల్ సీన్ తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో రాయలసీమ రూరల్ యువకుడిగా అఖిల్ కనిపించారు. ఆయన గత చిత్రాలతో పోలిస్తే పూర్తి డిఫరెంట్ లుక్‌లో, ఊర మాస్ గా ఉన్నారు. అఖిల్ డైలాగ్ డెలీవరి, చిత్తూరు యాసను పలికించిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, మాస్ రగ్డ్ లుక్ ఇలా అన్నీ అభిమానులకు కనువిందు చేస్తాయి. ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన’ అని అఖిల్ చెప్పిన డైలాగ్‌తో అతడి పాత్రలోని ఇంటెన్సిటీని చూపించారు. కత్తితో నరికే సీన్ హైలైట్ గా నిలిచింది. పల్లెటూరి అమ్మాయిగా భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించింది. అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఓవరాల్ గా ‘అమ్మిలందరూ తట్టుకోండి.. మనోడు వస్తున్నాడురోయ్’ అంటూ వచ్చిన 'లెనిన్' టీజర్ ఆకట్టుకుంటోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. కథేంటనేది పెద్దగా రివీల్ చెయ్యకపోయినా.. ఇది ఇంటెన్స్ ఎమోషన్స్‌తో పీరియాడిక్ విలేజ్ డ్రామా అని టీజర్ ని బట్టి తెలుస్తోంది. అద్భుతమైన విజువల్స్, బీజీఎమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో అఖిల్ అక్కాబావగా శరణ్య, శివాజీ కనిపించారు. బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ప్రవీణ్, పావని కరణం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ‘లెనిన్’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. దీనికి ఎస్. తమన్ సంగీతం సమకూర్చగా.. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.