Maruti Suzuki: ఇరాన్ యుద్ధంతో భారత్‌లో ఇంధన సంక్షోభం తలెత్తింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. డాలర్ విలువ పెరగడంతో రూపాయి విలువ భారీగా పడిపోతూ వస్తోంది. దీంతో దిగుమతుల కోసం విదేశీ మారకం నిల్వలను భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కార్పొరేటే సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు చర్యలు తీసుకున్నాయి. తాజాగా దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఆ దిశగా మంగళవారం పలు చర్యలను ప్రకటించింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తూనే పలు అంశాలపై ఆంక్షలు విధించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఆన్ ఫీల్డ్‌లో పని చేయాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని మారుతీ సుజుకీ కల్పించింది. అంటే ఆఫీసులు, కర్మాగారాల్లో పని చేయాల్సిన అవసరం లేని ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే వ్యాపార అవసరాలకు మాత్రమే విదేశీ పర్యటనలను పరిమితం చేయాలని నిర్ణయించింది. అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే దేశీయంగా కూడా ప్రయాణాలను తగ్గించకోవాలని ఉద్యోగులకు సూచించింది. ఆన్‌లైన్ సమావేశాలకే ఉద్యోగులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు మారుతీ సుజుకీ ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పొదుపు చర్యల వివరాలను వెల్లడించింది. 'ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దీర్ఘకాలిక ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రాధాన్యం ఇచ్చాం. సంక్షోభం, సాధారణ పరిస్థితులతో సంబంధం లేకుండా పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని, విదేశీ మారకద్రవ్య ఖర్చును కనిష్ఠానికి తగ్గించేలా సమర్థవంతంగా వ్యాపారాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కంపెనీ అనుసరిస్తున్న ప్రక్రియలను పునఃసమీక్షించుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలను ప్రకటించాం.' అని మారుతీ సుజుకీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆర్‌జీపీ గ్రూప్ ఆర్‌పీజీ గ్రూప్ సంస్థల్లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంలో తొలి అడుగుతో దేశం కోసం కదిలామని చెప్పారు. పొదుపు చర్యలు పాటించేందుకు తమ కంపెనీ సిద్ధమని చెప్పారు. ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్, నిత్యం జరిగే సమీక్షలు, మావేశాలు ఆన్‌లైన్‌లో నిర్వహించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.