చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ పోలీస్ కస్టడీ పిటిషన్‌ను మల్కాజ్‌గిరి పోక్సో ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. బండి భగీరథ్ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. ఈ కేసులో బండి భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని.. పోక్సో కోర్టు మళ్లీ ఆ రోజున విచారణ చేపట్టనుంది. ఇక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రస్తుతం బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. బాధితురాలితోపాటు ఆమె తల్లి వద్ద నుంచి కీలక విషయాలు సేకరించారు. అదే సమయంలో బండి భగీరథ్‌ 10 మంది ఫ్రెండ్స్‌ను విచారణ చేసి.. వారి వద్ద నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇక ఇప్పటికే బండి భగీరథ్ సెల్‌ఫోన్‌ను తీసుకున్న పోలీసులకు ఎలాంటి సమాచారం దొరకలేదు. సిమ్ లేకుండా ఫోన్ ఇవ్వడంతో.. అందులో ఎలాంటి డేటాను రికవరీ చేయలేదని తెలుస్తోంది. సిమ్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోయానని బండి భగీరథ్ పేర్కొనడంతో.. ఆధారాలను మాయం చేశారంటూ.. మరో సెక్షన్‌ను పోలీసులు యాడ్ చేశారు. దీంతో అతడిపై ఆరోపణలు రుజువు అయితే.. మరింత ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈ కేసులో బండి భగీరథ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను.. ఆయన తరఫు లాయర్ పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఈ పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పటికే అతడు అరెస్ట్ కావడంతో.. ఆ పిటిషన్‌తో ఉపయోగం లేదని.. దాన్ని వెనక్కి తీసుకునేందుకు అతని లాయర్ మెమో దాఖలు చేశారు.