మెగాస్టార్ , డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ‘మెగా 158’ అనే వర్కింగ్‌ టైటిల్‌ తో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాని ప్రారంభించారు. ఓపెనింగ్ సెర్మనీకి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. రెగ్యులర్ షూటింగ్ ,మొదలైందనే విషయాన్ని తెలియజేస్తూ.. ప్రారంభోత్సవానికి సంబంధించి స్పెషల్‌ వీడియోని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ మెగా 158’ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ వీడియో మెగా అభిమానులను అలరిస్తోంది. ఇందులో చిరు లీక్స్ గురించి ప్రస్తావించడం నవ్వులు పూయిస్తోంది. సినిమా టైటిల్‌ని చిరంజీవి రివీల్ చేయబోగా.. దర్శకుడు బాబీ ఇప్పుడే బయటకు చెప్పొద్దని అని పక్కకి వెళ్ళిపోతాడు. ''పిచ్చోళ్లు.. వాళ్లు చెప్పొద్దంటే ఆగిపోతామని అనుకుంటున్నారు. టైమ్‌ వచ్చినప్పుడు నేనే లీక్‌ చేస్తా. అప్పటి వరకూ వెయిట్‌ చేయండి. సూపర్‌ టైటిల్‌'' అని చిరంజీవి తనదైన శైలిలో అంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.