బెంగళూరులో ‘ఎబోలా’ కలకలం.. ఉంగాడా మహిళకు వైరస్ అనుమానిత లక్షణాలు

Wait 5 sec.

ఆఫ్రికా దేశాలను వణికిస్తోన్న ఎబోలా వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ప్రకటించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ కూడా ఎబోలా ప్రభావిత దేశాల నుంచే వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన ఓ మహిళకు వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల మహిళ మే 23న ఉగాండా నుంచి అహ్మదాబాద్.. అటు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. అనుమానిత లక్షణాలు గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెను రక్త నమూనాలను సేకరించి పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV)కి పంపినట్టు అధికారులు తెలిపారు. రిపోర్ట్ నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.కాగా, ఆ మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిత్విక్‌ రంజన్‌ పాండే మాట్లాడుతూ.. ఆ మహిళ ప్రస్తుతం వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆమెలో కనిపించిన లక్షణాలు ఎబోలా వైరస్‌‌కు సంబంధించినవేనా? కాదా? అనే విషయంపై ఇప్పుడు స్పష్టత ఇవ్వలేమని అన్నారు. మరోవైపు, పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఊరటనిచ్చే ప్రకటన చేసింది. బుండిబుగ్యో ఎబోలాకు తాము టీకాను కనుగొన్నట్టు రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో తెలిపారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని రష్యా ఎంబసీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టింది. కొత్త ఎబోలా స్ట్రెయిన్‌‌ను నిరోధించే విజయవంతమైన వ్యాక్సిన్‌ను రష్యా శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు తెలిపింది. ఈ టీకా బుండిబుగ్యో స్ట్రెయిన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. మరోవైపు, ఉగాండా, డీఆర్పీకే దేశాల్లో ఎబోలా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్‌‌ను ముమ్మురంగా చేపడుతున్నారు. ఇప్పటి వరకూ వ్యాప్తి కారణంగా 100 మంది చనిపోయినట్లు ఆఫ్రికా సీడీసీ ప్రకటించింది.