ప్రముఖ జువెలరీ కంపెనీ IPO.. ఈనెల 26 నుంచి షురూ.. ఒక్కో షేరుకు ఎంత, లేటెస్ట్ జీఎంపీ వివరాలు ఇవే!

Wait 5 sec.

Upcoming IPO: పొందాలనుకునే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం మంగళవారం నుంచి మరో కొత్త ఎస్ఎంఈ అందుబాటులోకి వస్తోంది. సాంప్రదాయ బంగారు ఆభరణాలతో పాటు హెరిటేజ్ డిజైనర్ నగల తయారీ, పెళ్లిళ్లు, పండగల కోసం సరికొత్త డిజైన్లను రూపొందించే కంపెనీ SMR జ్యూవెల్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మే 26వ తేదీన ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఐపీఓ విలువ ఎంత, ఒక్కో షేరుకు ఎంత నిర్ణయించారు, జీఎంపీ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ ఐపీఓ ద్వారా ఎస్ఎంఆర్ జ్యూవెల్స్ కంపెనీ మొత్తం రూ. 67.23 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 128 నుంచి రూ. 135గా నిర్ణయించింది. ఈ ఐపీఓలో పాల్గొనాలనుకునే వారు కనీసం 1000 షేర్లు కొనుగోలు చేయాలి. అనగా రూ. 2,70,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక కంపెనీ షేర్లు జూన్ 3వ తేదీన బీఎస్ఈ సహా ఎస్ఎంఈలో లిస్టింగ్ కానున్నాయి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2,49,000 షేర్లు విక్రయిస్తోంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 3 కోట్లు సమీకరించనుంది. అలాగే పబ్లిక్ కి రూ. 10 ఫేస్ వ్యాల్యూ గల 47,31,000 షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 64 కోట్లు పొందనుంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాలు, అదే విధంగా కంపెనీ తీసుకున్న లోన్స్ పూర్తిగా లేదా పాక్షికంగా పేమెంట్ చేసేందుకు ఉపయోగించాలని తెలిపింది. చివరగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసమూ వినియోగించనుందని తెలిపింది. ల్త్ మైన్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మ్యానేజర్ గా వ్యవహరించనుంది. ఇక ఈ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లకి 47.49 శాతం వాటాని, అలాగే ఎన్ఐఐలకి 38.01 శాతం వాటాని, అదేవిధంగా మార్కెట్ మేకర్స్ కి 5.00 శాతం వాటాని, చివరగా క్యూఐబీలకి 9.50 శాతం వాటాని కంపెనీ కేటాయించింది.ఈ ఐపీఓ డేట్స్ పరిశీలిస్తే జూన్ 1 షేర్స్ ఎలాట్మెంట్ ఉండనుంది. జూన్ 2వ తేదీన ఎలాట్మెంట్ వచ్చిన వారికి డీమ్యాట్ అకౌంట్లోకి షేర్లు క్రెడిట్ అవుతాయి. అలాగే ఈ కంపెనీ షేర్లు జూన్ 3వ తేదీన ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ ఎస్ఎంఈలో లిస్టింగ్ కానుంది. చివరగా ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.