తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజే 51 మంది మృతి.. 3 రోజుల్లో 107 మంది.. వరంగల్‌లోనే 23 మంది..!

Wait 5 sec.

కాకుండా యావత్ భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు.. తట్టుకోలేక పోతున్నారు. భానుడి భగభగలకు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏదో అత్యవసరాల కోసం మధ్యాహ్నం పూట బయటికి వచ్చిన వారు.. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇటీవల వడదెబ్బతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. అది శనివారం రోజున తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు.. గతంలో వడదెబ్బ తాకి చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50 వేలు పరిహారం అందించగా.. దాన్ని ఈ సారి రూ.4 లక్షలకు పెంచినట్లు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శనివారం నాడు ఒక్కరోజే మారింది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 23 మంది వడదెబ్బకు పిట్టల్లా రాలి మృతి చెందారు. మరోవైపు.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 11 మంది.. ఖమ్మంలో మరో ఏడుగురు.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదుగురు, నల్గొండ జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో ఒకరు సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లి.. అక్కడే వడదెబ్బకు గురై చనిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో గత 3 రోజుల్లో 107 మంది చ‌నిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. శ‌నివారం రోజున రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మ‌ధ్య గరిష్ఠ ఉష్ణోగ్రత‌లు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఇక.. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జగిత్యాల‌, సూర్యాపేట‌, ఖ‌మ్మం, మంచిర్యాల‌, ములుగు, కొమురం భీం జిల్లాలో 46 డిగ్రీల‌పైనే ఉష్ణోగ్రతలు న‌మోదు అయ్యాయి.ఇక.. ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. భీకరమైన వ‌డ‌గాల్పులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన క‌రీంన‌గ‌ర్, పెద్దప‌ల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, భూపాల‌ప‌ల్లి జిల్లాలతోపాటు.. ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌లో హీట్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. భీకరమైన ఎండ‌ల నేపథ్యంలో ప్రజ‌లు అత్యవసరం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్దని అధికారులు, డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని వెల్లడించారు.