రాజస్థాన్‌పై రోహిత్ 200 కొట్టి పంజాబ్‌ను గెలిపిస్తాడు.. యుజ్వేంద్ర చాహల్ స్టేట్‌మెంట్

Wait 5 sec.

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబై ఇండియన్స్ చేతుల్లో ఉంది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫలితం ఆధారంగానే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుందా? లేక ఇంటిదారి పడుతుందా? అనేది ఆధారపడి ఉంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కి ముందు చేసిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. అప్పటి వరకు వరుసగా ఆరు ఓటములు ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్.. ఈ విజయంతో ఓటముల పరంపరకు బ్రేక్ ఇచ్చింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ రాణించడంతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు తీసుకుని మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం యుజ్వేంద్ర చాహల్ మాట్లాడుతూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. "రాజస్థాన్ రాయల్స్‌పై 200 స్కోర్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవ్వాలి. మేం ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై కావాలి" అంటూ చాహల్ అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే.. పంజాబ్ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 14 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ఐదు, 13 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడో స్థానంలో ఉన్నాయి. డబుల్ హెడ్డర్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారంగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తాయా? లేదా? అన్నది తెలుస్తుంది. రాజస్థాన్ ముంబైపై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఎలిమినేట్ అవుతాయి.