: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తమ పౌరుల రక్షణ కోసం కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు భారతీయులు వెళ్లకూడదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా విజ్ఞప్తి చేసింది. అత్యవసరం అయితేనే వెళ్లాలని.. అందులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ఆరోగ్య ప్రకటనను విడుదల చేసింది.ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నియంత్రణ దాటిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంయుక్తంగా దీనిని . ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ (ఐహెచ్ఆర్-2005) ప్రకారం.. 2026 మే 17వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్'గా గుర్తించింది. ఈ అంతర్జాతీయ హెచ్చరికల నేపథ్యంలోనే భారత్ కూడా అప్రమత్తమై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయాణ ఆంక్షల అడ్వైజరీని తీసుకొచ్చింది.ప్రస్తుతం ఆయా దేశాలలో నివసిస్తున్న కేంద్రం సూచించింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.సరిహద్దుల్లో నిఘా తీవ్రం.. ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ఎబోలా రకాల్లో ఒకటైన 'బుండిబుగ్యో వైరస్' వ్యాప్తిని అరికట్టేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మే 22వ తేదీన సరికొత్త తాత్కాలిక సిఫార్సులను జారీ చేసింది. దీని ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలని కోరింది. ముఖ్యంగా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కారణం తెలియని తీవ్ర జ్వరం వంటి లక్షణాలు ఉంటే, వారిని వెంటనే గుర్తించి, ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించాలని స్పష్టం చేసింది.ఈ బుండిబుగ్యో వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలకు అనవసర ప్రయాణాలు చేయడాన్ని గ్లోబల్ హెల్త్ బాడీ కూడా స్పష్టంగా నిరాకరించింది. ఆఫ్రికాలో వైద్య సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు క్లిష్టంగా మారుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సలహాను విదేశాలకు వెళ్లే భారతీయులు, ముఖ్యంగా వ్యాపార, పర్యాటక రంగాల వారు కచ్చితంగా పాటించాలని విదేశాంగ వర్గాలు కోరుతున్నాయి.