బెంగాల్ మహిళలకు బంపరాఫర్.. జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం

Wait 5 sec.

: మహిళా సాధికారతను పెంపొందించడం, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పథకం జూన్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది. మహిళలకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేయడం, వారి ప్రయాణ ఖర్చులను తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను మే 21వ తేదీన విడుదల చేసింది.అన్ని కేటగిరీల బస్సులకూ వర్తింపు..రవాణా శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కేవలం స్థానిక బస్సులకే పరిమితం కాదని.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని రకాల సర్వీసులకు ఇది వర్తిస్తుందని చెప్పింది. అలాగే తక్కువ దూరం ప్రయాణించే లోకల్ రూట్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ప్రభుత్వ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన అన్ని పబ్లిక్ సర్వీస్ బస్సులకూ ఈ పథకం వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.ఉచిత బస్సు ప్రయాణానికి అవసరమైన పత్రాలివే..ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక డిజిటల్ మెకానిజంను తీసుకురానుంది. లబ్ధిదారులైన మహిళలకు క్యూఆర్ కోడ్, ఫోటో, పేరుతో కూడిన ఒక ప్రత్యేక 'స్మార్ట్ కార్డ్'ను జారీ చేస్తారు. ఈ స్మార్ట్ కార్డ్ కావాలనుకునే మహిళలు తమ పరిధిలోని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) లేదా సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీఓ) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు లబ్ధిదారురాలి తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఉపాధి హామీ జాబ్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు, లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు అదీ లేదంటే భారతీయ పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పీఎస్‌యూలు జారీ చేసిన సర్వీస్ ఐడీ కార్డ్, పాఠశాలలు, కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది.అప్పటి వరకు జీరో వాల్యూ టికెట్..దరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ స్మార్ట్ కార్డ్‌లు అందడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల జూన్ 1 నుంచి పథకాన్ని తక్షణమే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. స్మార్ట్ కార్డ్ వచ్చే వరకు పైన పేర్కొన్న ఫోటో గుర్తింపు కార్డుల్లో దేనినైనా బస్సులోని కండక్టర్‌కు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. గుర్తింపు కార్డును పరిశీలించిన తర్వాత ఆన్ డ్యూటీ కండక్టర్ సదరు మహిళా ప్రయాణికురాలికి ఉచితంగా జీరో వాల్యూ టికెట్ లేదా థర్మల్ పేపర్ టికెట్‌ను జారీ చేస్తారు.ఈ భారీ సంక్షేమ పథకానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మే 16వ తేదీనఆమోదం తెలపగా.. మే 18వ తేదీన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం దీనికి తుది ముద్ర వేసింది. ఇలా జూన్ 1వ తేదీ నుంచే ఈ పథకం క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. ఈ వార్త తెలుసుకున్న బెంగాల్ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.