ఐపీఎల్ 2026లో భాగంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ ప్రారంభమైంది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ స్వభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజ్ మ్యాచులు ముగిసే సరికి దీంతో ఈ రెండు జట్లు క్వాలిఫయర్-1లో తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఐపీఎల్ 2026 ఫైనల్‌కు చేరుకోనుంది.ఫస్ట్ బ్యాటింగ్ చేయడం పట్ల ఆర్సీబీ కెప్టెన్ రజత్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పిచ్‌లో మార్పు వస్తుందని తాము అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. భారీ స్కోరు చేసి, గుజరాత్ టైటాన్స్‌కు సవాల్ విసురుతామని ఈ సందర్భంగా కెప్టెన్ పటీదార్ వ్యాఖ్యానించాడు. కాగా గాయం కారణంగా ఐపీఎల్ 2026లో రెండో అర్ధభాగంలో మ్యాచులకు దూరమైన ఆర్సీబీ స్టార్ ఓపెనర్ ఈ మ్యాచుకు సైతం దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో కోహ్లీతో కలిసి.. వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.తుది జట్లు ఇవే..ఆర్సీబీ: వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్ఇంపాక్ట్ ప్లేయర్లు: సుయాశ్ శర్మ, కనిష్క్ చౌహాన్, అభినందన్ సింగ్, జోర్దాన్ కాక్స్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జాస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ కెజ్రోలియా, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణఇంపాక్ట్ ప్లేయర్లు: రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, సాయి కిషోర్