డిజిలాకర్ నుంచి భీమ్ UPI వరకు.. మీ ఫోన్‌లో ఉండాల్సిన 5 ప్రభుత్వ యాప్స్ ఇవే!

Wait 5 sec.

Govt Apps: భారత్‌‌లో పరిపాలన వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ అవసరమైన ప్రజా సేవలు చాలా సులభంగా మొబైల్ అప్లికేషన్ ద్వారానే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికీ చాలా మంది ప్రజలకు ఈ ప్రభుత్వ యాప్స్, వాటి ద్వారా అందే సేవలపై సరైన అవగాహన లేకపోవడం గమనార్హం. గుర్తింపు కార్డులను పొందడం నుంచి ట్రావెల్ పేమెంట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్‌స్టాంట్ బ్యాంక్ టూ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వంటి చాలా ఫీచర్లు ఈ ప్రభుత్వ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అవి వేగం, పారదర్శకతను అందిస్తూనే రోజు వారీ జీవనాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన 5 ముఖ్యమైన మొబైల్ అప్లికేషన్లను తమ ఫోన్లలో ఉంచుకోవాలి.డిజిలాకర్ ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, స్టడీ సర్టిఫికెట్లు, చట్టపరంగా వాలిడ్ డిజిటల్ డాక్యుమెంట్ల వంటివి దాచుకునేందుకు సురక్షితమైన క్లౌడ్ స్టోరేజీని ఇది అందిస్తుంది. పేపర్‌ లెస్ డాక్యుమెంటేషన్ కోసం ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉమాంగ్ యాప్ఉమాంగ్ యాప్ () అనేది 1000కి పైగా ప్రభుత్వ సర్వీసులకు ఒకే ఒక్క ప్లాట్ ఫారంగా చెప్పవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పాన్ కార్డ్, గ్యాస్ బుకింగ్ వంటి ఎన్నో సేవలు ఈ ఉమాంగ్ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వ సర్వీసులకు వన్- స్టాప్ సర్వీస్ యాక్సెస్ అందిస్తుంది. ఎంపరివాహన్ఎంపరివాహన్ () అప్లికేషన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలు, వర్చువల్ ఆర్‌సీ వంటి సేవలు ఇంట్లో నుంచే పొందవచ్చు. ఇందులో ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌టీఓ సేవలు పొందవచ్చు. డిజి యాత్రఇందులో ముఖ గుర్తింపు ఆధారిత ఎయిర్ పోర్ట్ ఎంట్రీ, పేపర్ లెస్ బోర్డింగ్ ప్రాసెస్ వంటి సేవలు పొందవచ్చు. భీమ్ యూపీఐభీమ్ యూపీఐ () ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. ఇన్‌స్టాంట్ బ్యాంక్ టూ బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్, క్యూఆర్ పేమెంట్స్, సురక్షితమైన యూపీఐ ట్రాన్సాక్షన్లు నిర్వహించవచ్చు. ఈ అప్లికేషన్‌లను సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు అవి క్రమంగా పేపర్ వినియోగాన్ని తగ్గించి సమయాన్ని ఆదా చేస్తాయి. అలాగే పరిపాలన, రవాణా, విదేశీ ప్రయాణం, రోజువారీ ఆర్థిక వ్యవహారాలు వంటి వివిధ రంగాలలో సేవలను మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడంలో ఈ యాప్స్ చాలా ఉపయోగపడతాయి.