AI Gurus: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence). పెద్ద పెద్ద టెక్ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్ని రంగాలు వేగంగా ఏఐని అందిపుచ్చుకుంటున్నాయి. వినియోగించుకునేందుకు కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించే విషయంలో తొలుత సంకోచించిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. ఏఐని విస్తృత స్థాయిలో అందిపుచ్చుకోకపోతే తాము మార్కెట్ పోటీలో వెనకబడిపోతామని భావిస్తున్నాయి. దీంతో ఏఐ సాధానాలు వాడేలా తమ ఉద్యోగులను సిద్ధం చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్ ఇస్తోన్న ఓ సంస్థ ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. అదే అమెరికాకు చెందిన .2025లో ఈ వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్‌ను ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్ స్థాపించారు. ఆ ఇద్దరు గతంలో సాఫ్ట్ బ్యాంకులో పని చేశారు. ఏఐ ప్లానింగ్‌లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్క కాస్ చెబితేనే 25 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.23,85,322 వరకు వసూలు చేస్తున్నారని గ్లోబల్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీలైన సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటివి వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్ కంపెనీ కస్టమర్ల జాబితాలో ఉన్నాయట. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, గూగుల్ జెమినై టూల్స్ తో తమ రోజు వారీ ఫైనాన్షియల్ టాస్కులను సులభంగా పూర్తి చేయడంలో బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇదే అవసరంగా మారడాన్నన చూస్తామని ఈ ఏఐ టీచర్లు చెబుతున్నారు. మరోవైపు చాలా మంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్ను సమర్థవంతంగా ఉపయోగించడంలో తగిన నైపుణ్యాలు లేవు. దాంతో పాత మోడళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూరించేందుకు భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్ రంగం వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఏఐతో లేఆఫ్స్‌ ఐటీ రంగానికే పరిమితం కావడం లేదు, స్టాండర్డ్ చార్టర్డ్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థలూ సంప్రదాయ ఉద్యోగాలను తొలగించే ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించాయి. రికార్డ్ స్థాయి ఆదాయాలను ఆర్జిస్తున్నా కూడా అవన్నీ కలిసి ఇప్పటి వరకు 5000 వేల ఉద్యోగులను తొలగించాయి. ఇక ఏఐ విస్తృత వినియోగంలో ఆసియా ముందువరుసలో ఉంది. ఐఎంఎఫ్ విడుదల చేసిన ఏఐ ప్రిపేర్డ్‌నెస్ సూచీలో 174 దేశాల్లో సింగపూర్ తొలిస్థానంలో ఉంది.