వరుసగా తగ్గి ఒక్కసారిగా బంగారం ధరల్లో మార్పు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఇప్పుడు ఎంతుందంటే?

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దాదాపుగా తెరపడినట్లే కనిపిస్తోంది. అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందానికి అతి చేరువగా వచ్చినట్లు తెలుస్తోంది. క్రమక్రమంగా హార్ముజ్ జలసంధి తెరుచుకోనున్నట్లు సమాచారం. ఇక 60 రోజుల పాటు రెండు దేశాలు.. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించుకుంటాయి. శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని వదులుకునేందుకు కూడా ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ వార్త.. గ్లోబల్ మార్కెట్లో సంబరాన్ని నింపింది. ఒకవైపు స్టాక్ మార్కెట్లు రాణిస్తున్నాయి. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు గణనీయంగా దిగొచ్చాయి. చాలా రోజుల తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరింది. ఇటు.. యూఎస్ డాలర్ విలువ కూడా పడిపోవడంతో మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ నగరంలో తాజాగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 300 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం మే 25న ఉదయం 10.30 గంటలకు చూస్తే రూ. 1,46,100 వద్ద ఉంది. దీనికి ముందు మే 22, 23 తేదీల్లో చూస్తే పసిడి ధర వరుసగా రూ. 400 చొప్పున తగ్గుముఖం పట్టింది. దానికి ముందు 3 రోజులు రూ. 750, రూ. 2200, రూ. 450 చొప్పున పెరిగింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే హైదరాబాద్ మార్కెట్లో ఇప్పుడు తులం రూ. 320 పెరగ్గా రూ. 1,59,380 వద్ద ఉంది. బంగారం ధర పెరిగినప్పటికీ.. మాత్రం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలోకు రూ. 2.95 లక్షల వద్ద ఉంది. ఇది గత 3 రోజులుగా ఏం మారలేదు. మే 21, 22 తేదీల్లో రూ. 5 వేల చొప్పున పెరిగింది. దానికి ముందు ఒకేరోజు రూ. 15 వేల మేర పతనమైంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,565 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కిందటి రోజు ఇది 4500 డాలర్ల దిగువన ఉండేది. సిల్వర్ రేటు చూస్తే 75 డాలర్ల నుంచి 78 డాలర్ల స్థాయికి పెరిగింది. ఇటు ముఖ్యంగా డాలరు విలువ పడిపోవడంతో బంగారం ధర పెరిగింది. సాధారణంగా డాలరు పెరిగితే.. బంగారం ధర తగ్గుతుంది. అదే డాలరు పడిపోతే.. గోల్డ్ రేటు పెరుగుతుంటుంది. ఇప్పుడు ఇదే జరిగింది. ఇక ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.34 స్థాయికి తగ్గింది.