: స్మాల్ క్యాప్ కేటగిరిలోని వెల్త్ మేనేజ్మెంట్ సెక్టార్ కంపెనీ () తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అలాగే ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ జూన్ 03గా నిర్ణయించారు. ఈ ప్రకారం, 1 ఈక్విటీ షేరు కలిగి ఉంటే మరో 1 ఈక్విటీ షేరు బోనస్‌గా లభిస్తుంది. అంటే డీమ్యాట్ ఖాతాలో 2 షేర్లు అవుతాయి. అలాగే 100 షేర్స్ ఉంటే మరో 100 షేర్స్ ఉచితంగా వస్తాయి. మొత్తం 200 షేర్లు అవుతాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో 21 శాతం లాభాన్ని అందించింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తాజాగా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటారో, అలాంటి వారికి అదనంగా రూ. 5 ఫేస్ వ్యాల్యూ గల 1 ఈక్విటీ షేరుని బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేయనున్నారు. అలాగే ఈ బోనస్ షేర్లు అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ జూన్ 3, 2026గా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో ఆనంద్ రాతి షేరు ధర 2 శాతం లాభంతో రూ. 538 వద్ద ముగిసింది. ఇక ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 794.85 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 416 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు ధర 3 శాతం లాభ పడింది. గత నెల రోజుల్లో 6 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో 22 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఏడాది కాలంలో 23 శాతం లాభాన్ని అందించింది. గత 7 నెలల్లో 18 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 3460 కోట్లుగా ఉంది.