క్రిస్ గేల్ 14 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టిన బుడ్డోడు.. యూనివర్సల్ బాస్ ఆడినప్పుడు వైభవ్ వయసు ఏడాదే..!

Wait 5 sec.

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అయితే తన బ్యాటింగ్‌తో యూనివర్సల్ బాస్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టాడు వైభవ్.ఐపీఎల్ 2012 సీజన్‌లో క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదాడు. గత 14 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ లాంటి పవర్ హిట్టర్లు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఆ రికార్డు నమోదైనప్పుడు ఏడాది వయసున్న వైభవ్.. తనకు 15 ఏళ్ల వయసు వచ్చాక దాన్ని అధిగమించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా పలు అరుదైన రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు..65* - వైభవ్ సూర్యవంశీ (2026)59 - క్రిస్ గేల్ (2012)52 - ఆండ్రీ రస్సెల్ (2019)51 - క్రిస్ గేల్ (2013)45 - జోస్ బట్లర్ (2022)బంతుల పరంగా ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్లు..16 - సురేష్ రైనా vs పంజాబ్ కింగ్స్, వాంఖడే, 201416 - వైభవ్ సూర్యవంశీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ముల్లాన్‌పూర్, 2026*17 - ఆడమ్ గిల్‌క్రిస్ట్ vs ఢిల్లీ క్యాపిటల్స్, సెంచూరియన్, 200920 - ఎంఎస్ ధోనీ vs ముంబై ఇండియన్స్, బెంగళూరు, 2012ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు..4 - క్రిస్ గేల్4 - వైభవ్ సూర్యవంశీ*2 - అభిషేక్ శర్మ2 - ఫిన్ అలెన్