కోల్ ఇండియాలో వాటా అమ్మేస్తున్న కేంద్రం.. నేటి నుంచే OFS షురూ.. ఒక్కో షేరుకు ఎంతంటే?

Wait 5 sec.

Coal India OFS: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి కంపెనీ కోల్ ఇండియాలో 2 శాతం వరకు వాటాను విక్రయించే ప్రక్రియ మొదలైంది. ఈ కంపెనీలోని తమ వాటాలో 2 శాతం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయింస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ ఆఫర్ ఫర్ సేల్ సబ్‌స్క్రిప్షన్ మే 27, 2026 నుంచే ప్రారంభమవుతోంది. రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేయడం మే 29వ తేదీ నుంచి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కోల్ ఇండియాలో వాటా విక్రయానికి సంబంధించిన ఆఫర్ ఫర్ సేల్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. (ఓఎఫ్ఎస్) ప్రక్రియలో ప్రభుత్వం విక్రయిస్తోంది. ఒక్కో షేరు కనీస ధర రూ.412 గా నిర్ణయించారు. ఇది మే 26వ తేదీన నాటి మార్కెట్ ముగింపు ధర ఎన్ఎస్ఈలో రూ.455.90తో పోలిస్తే 10 శాతం మేర డిస్కౌంట్ ధరకే లభిస్తుండడం గమనార్హం. ఈ ఆఫర్ ఫర్ సేల్ మే 27వ తేదీన మొదలై మే 29వ తేదీ వరకు కొనసాగుతుందని ఈ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ తన స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఒక్కో షేరుకు కనీస ధర రూ.412గా నిర్ణయించగా మొత్తం 12.32 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. రిటైయిలేతర మదుపరులు బుధవారం అంటే ఈనెల 27వ తేదీన, రిటెయిల్ ఇన్వెస్టర్లు ఈనెల 29వ తేదీ శుక్రవారం నుంచి బిడ్లు దాఖలు చేయవచ్చు. మే 28వ తేదీన బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంటుంది. మంగళవారం బీఎస్ఈలో కోల్ ఇండియా షేరు ముగింపు ధర రూ.458.25 కాగా ఈ ధరలో 10 శాతం తక్కువకే ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వ ఖజానాకు రూ.5000 కోట్లు సమకూరుతాయి. BSE, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒక ప్రత్యేక విండో విధానం ద్వారా ఈ షేర్ల అమ్మకం నిర్వహిస్తున్నారు. అదనంగా, సంబంధిత అధికారి ఆమోదానికి లోబడి, కోల్ ఇండియాలోని అర్హులైన ఉద్యోగులకు 25,000 వరకు ఈక్విటీ షేర్లను కేటాయించారు. అర్హులైన ఉద్యోగులు రూ. 5 లక్షల వరకు విలువైన షేర్ల కోసం బిడ్లు దాఖలు వేయవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కోల్ ఇండియాకు ప్రమోటర్‌గా కొనసాగుతోంది.కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో స్థిరమైన పనితీరును నమోదు చేసింది. మెరుగైన రాబడులు, అధిక ఇతర ఆదాయం కారణంగా, ఏకీకృత పన్ను అనంతర లాభం గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరిగి రూ. 10,908 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 6 శాతం పెరిగి రూ. 46,490 కోట్లకు చేరింది.