ప్రతి ఒక్కరికీ పబ్లిక్ వైఫై.. 'పీఎం వాణి' పథకంలో 15-60 నిమిషాల ప్లాన్స్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Wait 5 sec.

Yojana: దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (పీఎం వాణి యోజన) పథకం అమలుపై ఆయన మంగళవారం టెలికాం అధికారులతో సమీక్షించారు. చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ పబ్లిక్ వైఫైని ఉపయోగించుకునేలా, క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 'విద్యార్థులు, ప్రజా రవాణా ప్రయాణికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు సహా దేశ ప్రజలందరూ ప్రజా వైఫై ఉపయోగించుకునేలా, క్యూఆర్ కోడ్ లాగిన్ విధానాన్ని తెస్తున్నాం. వినియోగదారుల కోసం 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాల వరకు డ్యూరేషన్ గల ప్లాన్స్ ప్రవేశ పెడుతున్నాం. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పీఎం వాణి హాట్ స్పాట్లను సులభంగా గుర్తించేందుకు వీలుగా ప్రామాణిక గుర్తులు తేస్తున్నాం' అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పీఎం- వాణి సేవలకు సంబంధించిన ఆపరేటర్లు, సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను 8 వారాల్లోపు అమలు చేయాలని ఆదేశించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. దీంతో 2026 జూలై చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రావచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని అందరికీ చేరువ చేసే లక్ష్యంగా భాగంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రతి పౌరుడికి తక్కువ ధరలో డిజిటల్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. . వైఫై సేవలు అందరికీ సులభంగా చేరువ చేయడం, సౌకర్యవంతంగా, చౌకైన ఇంటర్నెట్ కనెక్షన్ అందించడమే ఈ పీఎం వాణి స్కీమ్ ముఖ్య ఉద్దేశం. పీఎం- వాణి సేవలను వేగంగా విస్తరించడం, వినియోగదారుల అనుభవం మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా చర్చలు జరిగినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. డిజిటల్ కాలంలో పబ్లిక్ వైఫై చాలా ముఖ్యమైన సౌకర్యంగా మారుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగుల, చిరు వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.