ట్యాక్స్ పేయర్లూ.. ITR-2 ఆన్‌లైన్ ఫైలింగ్ షురూ.. ఈ ఫామ్ ఎవరు ఫైల్ చేయాలంటే?

Wait 5 sec.

ITR Filing: అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఫైల్ చేసే సమయం మొదలైంది. ఈ క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఇ-ఫైలింగ్ ఐటీఆర్ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్నుల ఫారాలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగ ఐటీఆర్-2 ఫామ్, ఎక్సెల్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మే 27, 2026 రోజున ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని విద్యార్థులు, పెన్షనర్లు, ఉద్యోగులు సహా ఇతర ట్యాక్స్ పేయర్లు తమ ఐటీ రిటర్నులను ఫైల్ చేసేందుకు మార్గం సుగమమైంది. మరి తాజాగా విడుదల చేసిన ఐటీఆర్-2 ఎవరు ఫైల్ చేయాలి?ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు ట్యాక్స్ పేయర్లు ఆన్‌లైన్ ఎక్సెల్ యుటిలిటీలు లేదా ఆన్‌లైన్ యుటిలిటీలు లేదా ఐటీఆర్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఉపయోగించుకోవచ్చని ఐటీ శాఖ తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించిన రిటర్నులు ఫైల్ చేసేందుకు గడువు జూలై 31, 2026 వరకు ఉంటుందని తెలిపింది. ఇక ట్యాక్స్ ఇయర్ 2026-27కు అయితే ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు తేది జూలై 31, 2027 వరకు ఉంటుంది. ఐటీఆర్-2 ఎవరు ఫైల్ చేయాలి?ట్యాక్స్2 విన్ సహ వ్యవస్థాపకులు, సీఏ అభిషేక్ సోని తెలిపిన వివరాలు ప్రకారం... అయితే, వారికి బిజినెస్ లేదా వృత్తిపరమైన ఆదాయం లేకుండా ఇతర కాంప్లెక్స్ ఇన్‌కమ్ ఉంటే ఈ ఫామ్ ఎంచుకోవాలని సూచించారు. అంటే శాలరీ లేదా పెన్షన్ నుంచి ఆదాయం, రెండు అంతకన్నా ఎక్కువ ఇళ్ల నుంచి ఆదాయం, ప్రాపర్టీ లేదా పెట్టుబడుల విక్రయం ద్వారా క్యాపిటల్ గెయిన్స్ లేదా లాస్ వంటివి ఉన్నవారు ఈ ఐటీఆర్-2 ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం ఉండి, నాన్ రెసిడెంట్స్ అయి ఉంటే వారు ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు వీలుండదు కాబట్టి తప్పనిసరిగా ఐటీఆర్-2 ఫామ్ లేదా ఐటీఆర్-3 ఫామ్ లేదా ఇతర ఫామ్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. లాటరీలు, రేసు గుర్రాలు లేదా ఇతర చట్టబద్ధమైన జూదం కార్యకలాపాల ద్వారా వచ్చే గెలుపులు, అలాగే రూ. 5,000 దాటిన వ్యవసాయ ఆదాయం వంటి ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని నివేదించడానికి కూడా ITR-2ను ఉపయోగించవచ్చని పన్ను నిపుణులు చెప్పారు. అంతేకాకుండా, ఒక కంపెనీలో డైరెక్టర్లుగా పనిచేసే లేదా జాబితాలో లేని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు, వారి ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా, తప్పనిసరిగా ITR-2 ఫైల్ చేయాలి.