'ఇదే మంచి సమయం మీరు ముఖ్యమంత్రి కావొచ్చు' అని కొంతమంది తనకు సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు జనసేన పార్టీ అధినేత . చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో బాధగా అనిపించిందని.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక నగరానికి రూపకల్పన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆవేదన కలిగించిందన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో నిర్వహించారు.. 2024 ఎన్నికలకు ముందు పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఒక బలమైన నాయకుడిగా చూశానని.. అలాంటి వ్యక్తిని జైల్లో కూర్చోబెట్టారని.. రాజమండ్రి జైలు కట్టిన వ్యక్తిని అదే జైల్లో కూర్చోబెట్టారన్నారు.చంద్రబాబుతో తాను 2018లో విభేదించానని.. ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయన్నారు.. ఒకరు నాశనం కావాలన్న ఉద్దేవం నాకు ఉండదన్నారు పవన్ కళ్యాణ్. ' జైలుకు వెళ్లగానే చాలామంది నాకు సలహాలు ఇవ్వడానికి కొత్తగా పుట్టుకొచ్చారు.. అప్పుడు దాకా వదిలేసిన వాళ్లు సడన్‌గా వచ్చి ఇది మంచి సమయం.. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం ఇదేనని నాతో చెప్పారు. ఆయన జైలుకు వెళ్లిపోయారు.. మీరే అందర్ని కూర్చోబెట్టి.. మీరే లీడ్ చేస్తే మీరే సీఎం అవుతారని నాతో చెప్పారు. ఒకరు ఎదగాలంటే ఒకరు జైలుకు వెళ్లాలి.. మనం ఎదగాలంటే ఒకరు భౌతికంగా అక్కడ ఉండకూడదని ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలతో పార్టీ పెట్టారంటే.. ఎంత దిగజారుడుతనం ఇంకోటి ఉండదు' అన్నారు పవన్ కళ్యాణ్. '2023 సెప్టెంబరులో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో నేను బయటకు వచ్చాను.. రాజమహేంద్రవరం జైలకు వెళ్లి చంద్రబాబను కలిశాను.. ఆ సమయంలోనే ఆయనకు మద్దుతగా నిలబడ్డాను. ఆ రోజు నా ఎదుగుదల కంటే దేశం, రాష్ట్రం ఎదుగుదల, భద్రత చాలా ముఖ్యం అనిపించింది. ఆయన్ను కలసి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జైలు గది నుంచి బయటకు వచ్చిన 120 సెకన్లలో నా నిర్ణయాన్ని చెప్పాను. అప్పుడు నేను దాటవేయొచ్చు. లేదా ప్రధానితో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతాను అనొచ్చు. కానీ నేను నా దేశం, నా నేల కోసమే ఆలోచించి ప్రకటించాను. బీజేపీ నాయకులు కూడా నాతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో అప్పుడున్న అరాచకం మీద మాట్లాడాను. వాళ్లు కూడా నా మీద నమ్మకంతో అంగీకరించారు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు వేల కోట్ల పెట్టుబడులకు నాంది పలికింది. అదీ నా చిత్తశుద్ధి' అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.'క్రమశిక్షణగల సమూహాన్ని తయారు చేసుకున్నాం. పార్టీ నిర్మాణ ప్రక్రియలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యతలు. కమిటీల ముందుకు మీ పని తీరును ప్రతిబింబించే వివరాలు అందజేయండి. కాపు నాయకుల పేరుతో పదేపదే నాపై నిందలు వేస్తే ఇక ఉపేక్షించేది లేదు. నాకు కులం ముఖ్యం కాదు.. పార్టీ గురించి నిలబడిన వాళ్లే ముఖ్యం. అభాండాలు.. అన్యాయాల మీద జనసేనది రాజీలేని పోరాటం. ఇక నుంచి పార్టీపై జరిగే విష ప్రచారానికి గట్టిగా బదులివ్వాలి' అన్నారు పవన్ కళ్యాణ్. 'నా కోసం పనిచేసిన యువత బైక్‌ సైలెన్సర్లు పీకి హడావుడి చేసేవారు. ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రాని మహిళలు నా కోసం పని చేస్తున్నారు. నన్ను నమ్మి నా వెంట నిలిచిన వీరమహిళలకు ధన్యవాదాలు. సగటు ఆడపడుచులు నన్ను అర్థం చేసుకున్నంతగా మోదీ నన్ను అర్థం చేసుకున్నారు. మళ్లీ ఎవరూ అంత అర్థం చేసుకోలేకపోయారు. రెండేళ్లుగా నా నవ్వు పోయింది. బాధ్యత అప్పగించిన తర్వాత బరువు పెరిగింది. 12 ఏళ్ల పోరాటం తర్వాత కూడా నన్ను విమర్శిస్తున్నారు. నేను ఏమి చేసినా సమస్యే.. జుట్టు పెంచుకుంటే సమస్య.. గడ్డం పెంచితే సమస్య.. వాళ్ల టీఆర్‌పీలకు నేను రా మెటీరియల్‌ అయ్యాను. 12 ఏళ్లు నలిగిన తర్వాత వచ్చిన బలం, ఆత్మవిశ్వాసంతో తట్టుకుని నిలబడ్డాను. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొదలుకొని ఫైటర్‌ ప్లేన్స్‌, గూగుల్‌ వంటి కంపెనీలు వస్తున్నాయంటే రాజమండ్రిలోనే దానికి మూలాలు పడ్డాయి' అన్నారు పవన్ కళ్యాణ్.