OpenAI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఊరట కల్పించే మాట చెప్పారు టెక్ దిగ్గజం . ఏఐ కారణంగా ఉద్యోగాలు భారీ స్థాయిలో పోవని మంగళవారం స్పష్టం చేశారు. ఇంతకు ముందు తాను సిడ్నీలో జరిగిన కామన్‌వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. సీబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ మ్యాట్ కామిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2022లో చాట్ జీపీటీని ప్రారంభించిన సమయంలో చేసిన టెక్నికల్ అంచనాలు నిజమయ్యాయని కానీ, దాని వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం విషయంలో తాము తప్పుగా అంచనా వేశామని శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఈ విషయంలో తన అంచనా తప్పినందుకు చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రారంభ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని భావించానని, కానీ వాస్తవానికి అలా జరగలేదన్నారు. గతంలో హెచ్చరికల వల్ల, మార్కెట్లో కొంత భయాందోళనలు నెలకొన్న మాట నిజమేనని, అయితే ఒక ప్రమాదం సంభవిస్తుందని అనుకున్నప్పుడు దాని గురించి ముందే మాట్లాడడం సరైనదని అప్పట్లో భావించినట్లు గుర్తు చేసుకున్నారు. మనుషులను ఏఐ భర్తీ చేయలేదుఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఉద్యోగాల్లో ఉండే మనుషుల భాగస్వామ్యం, మానవీయ కోణాన్ని ఏ టెక్నాలజీ కూడా భర్తీ చేయలేదని శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. శ్లాక్, ఇ-మెయిల్ సందేశాలకు సమాధానాలు ఇచ్చేందుకు తాను స్వయంగా ఏఐ ఉపయోగించానని, ఇది శామ్ ఏఐ అని బదులిచ్చేలా సెట్ చేశానని గుర్తు చేసుకున్నారు. అయితే ఎటువంటి కచ్చితమైన ఉద్యోగాల గణాంకాలను ప్రస్తావించలేదు. అమెజాన్, హెచ్ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, సీబీఏ వంటి గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే కొన్ని విభాగాల ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ ధోరణి కొనసాగుతుండడం ఆందోళనలు పెంచుతోంది. మరోవైపు.. సిద్ధమవుతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 60 బిలియన్ డాలర్లు అంటే రూ. 5.70 లక్షల కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఓపెన్ ఏఐ ఐపీఓ వస్తే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూల్లో ఒకటిగా మారనుంది.