ఏపీ డిప్యూటీ సీఎం,. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీకి డిప్యూటీ సీఎం అయినప్పటికీ.. తెలంగాణలోనూ ఆయనకు భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితేఅనంతరం.. తెలంగాణ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతుగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించడం.. అందులో పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు జనసేనకు కోపం తెప్పించాయి. దీంతో మరుసటి రోజే తెలంగాణ నేతలు ప్రెస్ మీట్ పెట్టి.. కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేయటంతో.. ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి రాజకీయ పరిస్థితులలో సినీ నిర్మాత, నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని.. అవకాశం వచ్చిన రోజు తనకు తెలిసిన నిజాలు అన్నీ చెప్తానంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. "పవన్ కళ్యాణ్ సార్ ముందు మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ రోజు వస్తే ఆయన గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన గొప్ప మనసును, క్యారెక్టర్‌ను, నైజాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచం ముందు గర్వంగా చెబుతాను. పదవులు, హోదాలు కాదు.. మనిషి విలువ అతని ప్రవర్తనలో, మాటలో, మనసులో ఉంటుందని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి నా హృదయంలో ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచే ఆ క్షణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాను." అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనతో కలిసి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలను అందించారు. పవన్ కళ్యాణ్‌ను హీరోగా కాకుండా దేవుడిగా అభిమానిస్తుంటారు బండ్ల గణేష్. ఇక ఇటీవలే ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ పక్క పక్కనే ఉన్న సమయంలో దేవుడు, భక్తుడి మధ్యలో తానెందుకు నెట్టింట వైరల్ అయ్యింది. మరోవైపు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచిన బండ్ల గణేష్.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యాపారాల మీద దృష్టి పెట్టిన ఆయన.. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించినందుకు ఇటీవల షాద్ నగర్ నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించి మరోసారి పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. ఇక ఇప్పుడు తెలంగాణలోని కొంతమంది నేతలు, జర్నలిస్టులు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో.. ఆయనకు అండగా నిలబడటం ప్రాధాన్యం సంతరించుకుంది.