ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్‌ను నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీచేయబోమని.. ఒకవేళ మీటర్లు బిగించకుండా కొనసాగిస్తే పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ విసిరారు. దేశంలో తొలిసారి రైతు డిస్కం ఏర్పాటుచేశామని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ కోసమేనని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.అంతేకాదు, రైతు పండించే ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధరను నిర్ణయించిన కేంద్రం.. రైతు పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అన్నారు. ‘రాష్ట్రం కొనుగోలుచేసిన ప్రతి గింజను కేంద్రం కొనాలని, లేకుంటే బీజేపీ నేతల ఇళ్ల వద్ద నిరసనలు చేపడతాం’ అని హెచ్చరించారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హరీష్ రావు చెప్పిన ధరకే బియ్యం అమ్ముతామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ కొనసాగిస్తామని రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు అబద్దాల పునాదులపై రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2034 వరకు తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజలకు మేలు చేయాలనేది తన ఉద్దేశమని అన్నారు. 2029 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ నాయకత్వంలో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని, తమది విజయవంతమైన జోడీ అని జోస్యం చెప్పారు.ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలపై కూడా రేవంత్ ప్రస్తావించారు. చర్చల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెబుతున్నారని, కానీ తుమ్మిడిహట్టిపై మాట్లాడేందుకు మహారాష్ట్ర సీఎం సమయం ఇవ్వడం లేదని అన్నారు.