పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో శనివారం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జరిగింది. ఎన్నికల అనంతర హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా ఆయనపై గుడ్లు, రాళ్లు విసిరారు. ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా 'దొంగ దొంగ' అని నినాదాలు చేశారు. ఈ దాడి నుంచి అభిషేక్‌కు కాపాడేందుకు భద్రత సిబ్బంది తమ హెల్మెట్ ఇచ్చి రక్షణగా నిలిచారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించింది. అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది ఆయనను చుట్టుముట్టి రక్షణగా నిలుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిని బీజేపీయే ప్రోత్సహించిందని ఆరోపించారు. ‘ఇదంతా బీజేపీయే ప్రోత్సహించింది. వాళ్లు ఏం చేశారో చూడండి. ఇదేనా వాళ్ల ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. నెల కూడా కాలేదు, పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు’’ అని ఆయన అన్నారు. దాడి చేసినవారు తనను చంపడానికే వచ్చారని ఆరోపించిన బెనర్జీ.. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయిందని పేర్కొన్నారు. ‘‘వారు నన్ను చంపాలనుకున్నారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. మేము ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తప్పకుండా తీసుకువస్తాం... గవర్నర్‌కు కూడా తెలియజేస్తాం.. నేను తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాను’’ అని ఆయన అన్నారు.తాను తృటిలో తీవ్ర గాయాల నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ‘‘నా తలకు గాయంకాకుండా తప్పించుకున్నారు.. అదృష్టవశాత్తు, నేను హెల్మెట్ ధరించాను.. వారు నా బట్టలు చించి, నా కళ్లజోడు పగలగొట్టారు’’ అని తెలిపారు. అంతేకాదు, ‘‘ఘటనా స్థలంలో పోలీసుల ఉనికి లేదు. వారు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. చంపనివ్వండి.. నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడ నుంచి కదలను’’ అని ఆయన అన్నారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసే వరకు తాను వెళ్లబోనని తేల్చిచెప్పారు. ఉద్రిక్తతల నడుమ పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని బెనర్జీని రక్షించారు.కలవడానికి వచ్చిన బాధిత కుటుంబాన్ని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ ‘‘ఈ పరిస్థితుల్లో వృద్ధులైన సంజు తల్లిదండ్రులను నేను వదిలిపెట్టి వెళ్లను. పోలీసులను సంప్రదించమని నేను మరోసారి మా ప్రతినిధులను కోరతాను’’ అని అన్నారు. తమ పర్యటన గురించి అధికారులకు తమ పార్టీ ముందుగానే తెలియజేసింది కానీ స్పందించలేదని చెప్పారు. ఈ ఘటనపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ స్పందిస్తూ.. అభిషేక్ బెనర్జీ ప్రాణాలకు ప్రమాదం ఉందని, పోలీసులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.