ఇది కదా కావాల్సింది.. 2 నెలల్లోనే 144 శాతం పెరిగిన స్టాక్.. లక్ష పెడితే రూ.2.44 లక్షలొచ్చాయ్!

Wait 5 sec.

Trending Stock: టెలికాం ఉత్పత్తులను తయారు చేసి టెక్నాలజీ కంపెనీ హెచ్ఎఫ్‌సీఎల్ లిమిటెడ్ ( Ltd) షేర్స్ రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్నాయి. తమ ఇన్వెస్టర్లపై ఊహించని విధంగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలను అందుకున్నాయి. భారీ ర్యాలీతో ఈ స్టాక్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మదుపరులు ఎగబడుతున్నారు. అయితే, మార్కెట్ విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు. మరి ఈ టెలికాం సెక్టార్ కంపెనీ స్టాక్ గురించిన వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. టెలికాం ఉత్పత్తులు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తయారు చేసే హెచ్ఎఫ్‌సీఎల్ కంపెనీ స్టాక్ ఈ ఏడాది జనవరి, 2026లోనే 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ.59.82ను తాకింది. కానీ, ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే 172 శాతం మేర పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.162.50ని సోమవారం (మే 25) నాటి ట్రేడింగ్‌లో నమోదు చేసింది. అలాగే మార్చి 24వ తేదీన రూ.66.55 వద్ద ఉన్న ఈ స్టాక్ ధర 144 శాతం మేర పెరిగింది. అంటే కేవలం రెండు నెలల్లోనే లక్ష రూపాయల పెట్టుబడిని రూ.2.44 లక్షలు చేసింది. అలాగే గత వారం రోజుల్లో చూసుకుంటే ఈ స్టాక్ 15 శాతం మేర ర్యాలీ చేసింది. ప్రస్తుతం ఈ స్టాక్ పీఈ రేషియో 69కి పైగా ఉంది.ఈ స్టాక్ కొనాలా, అమ్మాలా, వేచి చూడాలా?INVasset పీఎంఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసాని ప్రకారం HFCL బేస్ బ్రేక్అవుట్ నుంచి మొమెంటం ఎక్స్టెన్షన్ దశలోకి ప్రవేశించింది. ఈ స్టాక్ ఒక వారంలోనే వేగంగా కదిలి, తన గత 52-వారాల గరిష్ఠ స్థాయిని దాటేసింది. ఇది దాని బలాన్ని ధ్రువీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ బ్రేక్అవుట్‌లోని సులభమైన భాగం బహుశా ముగిసిపోయిందని కూడా చెప్పారు.ధరలు మునుపటి నిరోధక స్థాయిని దాటి ఇంత వేగంగా పెరిగినప్పుడు, ఈ పెరుగుదల సంస్థాగత కొనుగోళ్ల వల్ల జరిగిందా లేక కేవలం స్వల్పకాలిక ఒత్తిడి వల్ల జరిగిందా అనే విషయాన్ని మొదటి తగ్గుదల సాధారణంగా సూచిస్తుందని ఆయన తెలిపారు. ముగింపు ధరల ప్రకారం HFCL షేరు రూ. 150 నుంచి రూ. 155 మధ్య బ్రేక్అవుట్ బ్యాండ్‌ను నిలబెట్టుకున్నంత కాలం, ఈ స్ట్రక్చర్ నిర్మాణాత్మకంగానే ఉంటుంది. తక్కువ వాల్యూమ్స్‌తో నియంత్రిత రీటెస్ట్ జరిగితే ట్రెండ్ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఆ జోన్ కింద తిరిగి ముగిస్తే అది బ్రేక్అవుట్‌ను బలహీనపరిచి, మరింత లోతైన మీన్ రివర్షన్ ప్రమాదాన్ని తెస్తుందని హెచ్చరించారు.HFCL త్రైమాసిక ఫలితాలుఅంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నెట్ లాస్ రూ.81.44 కోట్లగా ఉండగా ఈసారి భారీ లాభాలు అందుకుంది. అలాగే కంపెనీ నెట్ సేల్స్ 128 శాతం మేర పెరిగి రూ.1824 కోట్లకు చేరుకున్నాయి. ఇక క్వార్టర్ టూ క్వార్టర్ చూసుకుంటే కంపెనీ నెట్ ప్రాఫిట్ 82 శాతం పెరిగింది.