Price Hike: ప్రస్తుతం ఏ రంగం చూసిన తీవ్ర అనిశ్చితిలో ఉంది. దీంతో కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంధన కొరత ఏర్పడడం, డాలర్ విలువ భారీగా పెరగడం వంటి కారణాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణాలతో పలు మొబైల్ తయారీ కంపెనీలు స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రెడ్ మీ మరోసారి తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మరోసారి ఫోన్ల ధరలను పెంచినట్లు తెలిపింది. మరి ఏ మోడల్ ఫోన్ ధర ఎంత మేర పెరిగింది? కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.రెడ్ మీ కంపెనీ మరోసారి స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచడంతో కొనుగోలుదారులు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రెడ్ మీ 15 (Redmi 15 5G), రెడ్ మీ నోట్ 15 (Redme Note 15 5G) ఫోన్ల ధరలను రూ.2 వేల వరకు పెంచుతున్నట్లు రెడ్ మీ కంపెనీ ప్రకటించింది. పెరిగిన ధరలను మే 25వ తేదీ సోమవారం నుంచే అమలులోకి వచ్చినట్లు తెలిపింది. సవరించిన ధరలను పరిశీలిస్తే రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ 8జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.2 వేలు పెరిగి రూ. 24,999 నుంచి రూ. 26,999కి చేరింది. ఈ ఏడాది 2026 జనవరిలోనే ఈ ఫోన్ విడుదల చేసింది. అప్పుడు ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 22,999 వద్ద ఉంది. కానీ, ఇప్పుడు రూ.4 వేల వరకు ధర పెరగడం గమనార్హం. స్థాయికి చేరింది. అలాగే రెడ్ మీ 15 స్మార్ట్ ఫోన్ 6జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 2 వేలు పెరిగి రూ. 18,499 నుంచి రూ. 20,499 స్థాయికి చేరుకుంది. ఇక రెడ్ మీ 15 స్మార్ట్ ఫోన్ 8జీబీ ప్లస్ 128 జీబీ ధర రూ. 20,499 నుంచి రూ. 22,499 వద్దకు ఎగబాకింది. అలాగే ఇదే ఫోన్ 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర చూస్తే రూ. 2 వేలు పెరిగి రూ. 22,499 నుంచి రూ. 24,499 వద్దకు చేరుకుంది.