మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులపై మోత.. లీటరుకు ఇవాళ ఎంతంటే?

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్‌లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టిన . సోమవారం రోజు (మే 25) మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచేశాయి. ఈసారి కూడా మళ్లీ ధరల పెంపు భారీగానే ఉంది. లీటరు పెట్రోల్‌పై సగటున రూ. 2.61 చొప్పున పెరిగింది. డీజిల్‌పై చూస్తే రూ. 2.71 మేర పెరిగింది. తొలుత మే 15న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచగా.. తర్వాత మే 19న ఒకసారి, 23న ఒకసారి పెంచాయి. ఇప్పుడు మే 25న మరోసారి పెంచగా.. మొత్తంగా 10 రోజుల వ్యవధిలోనే ధరలు ఏకంగా 4 సార్లు పెరగడం గమనార్హం. ఈ క్రమంలో గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు సగటున రూ. 7.50 కుపైనే పెరిగాయని చెప్పొచ్చు.దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 2.61 చొప్పున పెరిగి లీటరుకు రూ. 102.12 కు చేరింది. ఇక రూ. 2.71 మేర పెరగ్గా ప్రస్తుతం లీటరు ధర రూ. 95.20 వద్ద ఉంది. ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో పెరుగుతుండటం సహా ఇదే సమయంలో రూపాయి పతనం అవుతుండటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పడుతోంది. చాలా రోజులు ఓపిక పట్టి ధరల్ని పెంచుకుండా స్థిరంగా ఉంచినప్పటికీ.. ఇక తప్పని పరిస్థితుల్లో ధరల్ని పెంచుతున్నాయి. హైదరాబాద్ పెట్రోల్, డీజిల్ రేట్లు..హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రధాన మెట్రో నగరాల్లో దేశంలోనే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్‌పై రూ. 2.84 పెరిగి లీటరుకు రూ. 115.69 వద్ద ఉంది. మే 15న రూ. 3.39 పెరగ్గా.. 19న రూ. 0.95, 23న రూ. 0.97 పెరగ్గా ఇప్పుడు రూ. 2.84 పెరిగింది. ఈ క్రమంలో పెట్రోల్ ధర 10 రోజుల్లో రూ. 107.50 నుంచి రూ. 115.69 కి చేరింది. డీజిల్ ధర హైదరాబాద్ సిటీలో తాజాగా రూ. 2.88 చొప్పున పెరగ్గా లీటరుకు రూ. 103.82 వద్ద ఉంది.ఏపీలో అత్యధికం..మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లో ఇంధన ధరలు ఎక్కువగా ఉంటే.. ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. స్థానిక పన్ను రేట్లు అధికంగా ఉండటం ప్రధాన కారణం. విజయవాడలో పెట్రోల్ లీటరుకు రూ. 117.88 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 105.54 వద్ద ఉంది.