తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ పాలనాపరమైన అంశాల్లో బిజీ అయ్యారు.. శాఖలవారీగా సమీక్షలు చేస్తున్నారు. విజయ్ తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవల స్కూళ్లు, ఆలయాల దగ్గర మద్యం షాపుల్ని రద్దు చేశారు.. అలాగే తన కాన్వాయ్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఈ క్రమంలో విజయ్ కాన్వాయ్ వెళ్లేలా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే తమిళనాడుకు సంబంధించిన సమస్యలపై కేంద్రానికి వరుసగా లేఖలు కూడా రాశారు. ఇటీవల తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం గమనించదగ్గ విషయమన్నారు విజయసాయిరెడ్డి. ఏఐ ఆవిష్కరణలు, ప్రతిభ, అభివృద్ధి, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక స్వీకరణను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా ఇలాంటి ప్రత్యేక సంస్థాగత యంత్రాంగాల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో ఏఐ పోటీలో ముందుండే దేశాలు భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతాయన్నారు. విజయ్ తీసుకున్న నిర్ణయం బావుందని ప్రశంసలు కురిపించారు విజయసాయి. తమిళనాడు సీఎం విజయ్‌ తీసుకున్న నిర్ణయాలపై విజయసాయిరెడ్డి స్పందిస్తున్నారు. సాంకేతికత వేగంగా మారుతున్న వేళ ఏఐ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. తాజా తమిళనాడు మంత్రివర్గ విస్తరమలో వేళచ్చేరి నియోజకవర్గ ప్రతినిధి కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏఐ మంత్రిత్వశాఖ ద్వారా రాబోయే రోజుల్లో ఉద్యోగాల సృష్టి, డేటా సెంటర్లు , స్మార్ట్ గవర్నెన్స్‌లో ఈ ఏఐ మంత్రిత్వ శాఖ కీలకం కాబోతుంది అంటున్నారు.'నైపుణ్యం ఉన్న అభ్యర్థులు యాక్టివ్‌గా ఉద్యోగాల కోసం వెతుకుతున్నా.. భారతదేశవ్యాప్తంగా అనేక కార్యాలయాల్లో సిబ్బంది కొరత కొనసాగుతోంది. ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రైవేట్ రంగంలో నియామకాలు నెమ్మదిగా, క్లిష్టంగా, నిరాశపరిచే విధంగా ఉన్నాయి. చాలా మంది దరఖాస్తు చేసుకున్నా కనీసం స్పందన కూడా లేదు. ఈ గ్యాప్ పూడ్చి, శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి భారతదేశానికి మరింత క్రమబద్ధమైన, పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన నియామక ప్రక్రియ అవసరం' అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చెప్పారు. 'ఢిల్లీ జింఖానా క్లబ్‌ను విలువైన ప్రభుత్వ భూమిని ఖాళీ చేసి తిరిగి అప్పగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది. సమానత్వం, సమ్మిళితత్వాన్ని ఆకాంక్షించే ఆధునిక భారతదేశంలో వివక్ష, వలసవాద కాలం నాటి ప్రత్యేక హక్కుల వారసత్వాన్ని మోస్తున్న సంస్థలకు స్థానం లేదు' అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.