డేవిడ్ వార్నర్‌ని బ్లాక్ చేసిన సన్‌రైజర్స్.. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్!

Wait 5 sec.

మాజీ కెప్టెన్, ఆరెంజ్ ఆర్మీకి ఐపీఎల్ ట్రోఫీ అందించిన గ్రేట్ లెజెండ్ డేవిడ్ వార్నర్‌ని ఎస్ఆర్‌హెచ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆ జట్టుకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా, ఇటీవల కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ నెగ్గాలంటే ఎవరు ఎలా ఆడాలో చెబుతూ ఒక పోస్ట్ కూడా చేశాడు. అయితే, సడెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను బ్లాక్ చేసిందంటూ డేవిడ్ వార్నర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తనను సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ చిర్రెత్తిపోయారు. ఆరెంజ్ ఆర్మీకి ట్రోఫీ తీసుకొచ్చిన కెప్టెన్‌ను ఇలా ట్రీట్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు అయితే సన్‌రైజర్స్ అధికారిక అకౌంట్‌‌ను ట్యాగ్ చేస్తూ ప్లీజ్ డేవిడ్ వార్నర్‌ని అన్ బ్లాక్ చేయండి అని రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఆ పోస్టు కింద వాళ్లు నన్ను అన్ బ్లాక్ చేయరు అంటూ డేవిడ్ వార్నరే రిప్లయ్ ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2024 నుంచి ఐపీఎల్‌లో ఆడటం లేదు. ఆస్ట్రేలియాకు కూడా పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ లెజెండ్‌ ఇంటర్నేషనల్ టీ 20 లీగ్‌లలో ప్రస్తుతం కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా డేవిడ్ వార్నర్ ఆడటం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో డేవిడ్ వార్నర్ జర్నీ అంతా ఇంతా కాదు. డేవిడ్ వార్నర్‌కి సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి చాలా అనుబంధమే ఉంది. సన్‌రైజర్స్ చరిత్రలో డేవిడ్ వార్నర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకెవ్వరూ చేయలేదు. 2014లో సన్‌రైజర్స్‌లో అడుగుపెట్టిన వార్నర్ అతికొద్ది కాలంలోనే జట్టుకు వెన్నుముకగా మారి కెప్టెన్సీ కూడా చేపట్టాడు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. కేవలం బౌలర్లతోనే గెలిచిన రికార్డు కూడా డేవిడ్ వార్నర్‌దే. అదే సమయంలో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. డేవిడ్ వార్నర్ 2015, 2017, 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. సన్‌రైజర్స్ తరఫున 95 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 49.56 యావరేజ్‌తో మొత్తం 4014 పరుగులు చేశాడు. రెండు సెంచరీలతో పాటు నలభై హాఫ్ సెంచరీలు కూడా అందులో ఉన్నాయి. ఐపీఎల్ 2021 డేవిడ్ వార్నర్ కెరీర్‌లోనే కాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌‌‌‌‌కి కూడా గుర్తుండిపోయే సంవత్సరం. అదే ఏడాది డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన మేనేజ్‌మెంట్ చివరికి అతనితో వాటర్ బాటిల్స్ కూడా మోయించింది. యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలో డగౌట్‌కే పరిమితమయ్యాడు. చివరికి 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్‌ని రిలీజ్ చేసింది.