ఏపీలోని కూటమి పార్టీల మధ్య అప్పుడప్పుడూ లుకలుకలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సమన్వయానికి కూటమి పార్టీల అధిష్టానాలు చర్చలు తీసుకుంటున్నప్పటికీ.. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు కనిపించలేదు. దీంతో అసంతృప్త జ్వాలలు అప్పుడప్పుడు భగ్గుమంటున్నాయి. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు వెలుగుచూశాయి. అవి ఎంతవరకూ వెళ్లాయంటే మంత్రి అనుచరులు తనను చంపాలని చూస్తున్నారంటూ టీడీపీ నేత ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించటం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..ధర్మవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డి ఆదివారం అనంతపురం ప్రెస్ క్లబ్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే, ఏపీ ఆరోగ్య శాఖ అనుచరుల మీద సంచలన ఆరోపణలు చేశారు. అనుచరులు ధర్మవరంలో రౌడీయిజం చేస్తున్నారని అంజన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో అనుకూలంగా పనిచేయలేదంటూ మంత్రి అనుచరులు తనపై దాడి చేశారని ఆరోపించారు. తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని.. మంత్రి సత్యకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలు అనంత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.మరోవైపు గత ఎన్నికల సమయంలో ధర్మవరం నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ టీడీపీ నుంచి పోటీ చేద్దామని భావించారు. అందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీ దక్కించుకుంది. మీద విజయం సాధించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ధర్మవరంలో అడుగుపెట్టిన సత్యకుమార్ యాదవ్.. సిట్టింగ్ ఎమ్మెల్యేకే షాకివ్వడం సంచలనం రేపింది. అయితే కూటమి అభ్యర్థి గెలిచినప్పటికీ.. అప్పుడప్పుడూ ధర్మవరం టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య విభేదాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే అంజన్ రెడ్డి ఏకంగా మంత్రిపై ఆరోపణలు చేయటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.