యూపీఐ ద్వారా PF విత్ డ్రా ప్రారంభించే ముందు.. ఉద్యోగులు తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సిన 5 విషయాలు ఇవే!

Wait 5 sec.

UPI PF: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన చందాదారులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈపీఎఫ్ఓ వేగంగా అడుగులు వేస్తోంది. దీనివల్ల ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును నేరుగా, అత్యంత వేగంగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చు. అయితే ఈ సరికొత్త సేవను ఎలాంటి అంతరాయం లేకుండా అందుకోవాలంటే ఈపీఎఫ్ఓ చందాదారులు తమ అకౌంట్లో అత్యంత కీలకమైన 5 వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పీఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఈపీఎఫ్ఓ తీసుకువస్తున్న ఈ కొత్త డిజిటల్ విప్లవం ద్వారా ఉద్యోగులు తమ విత్ డ్రా చేసుకోదగిన పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్లైన్లో చూసుకుని, కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా క్షణాల్లో సొమ్మును అకౌంట్లోకి తెచ్చుకోవచ్చు. కానీ, ఈ ప్రక్రియ అంతా డిజిటల్ అథెంటికేషన్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, మీ ఖాతాలో 5 అంశాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. 1.యూఏఎన్ యాక్టివేషన్, పాస్‌వర్డ్యూపీఐ సేవలు ప్రారంభం కావాడనికి ముందే మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివ్ గా ఉందో లేదో చూసుకోవాలి. చాలా మంది తమ పాస్‌వర్డులను మర్చిపోతుంటారు లేదా పాత మొబైల్ నంబర్లను మార్చకుండా వదిలేస్తుంటారు. అత్యవసరంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఇప్పుడే మీ యూఏఎన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.2.ఆధార్, పాన్, పేరు వివరాలు సరిపోలాలిమీ ఆధార్ కార్డ్, పాన్ కార్డులలో ఉన్నట్లుగానే ఈపీఎఫ్ఓ రికార్డులలో కూడా మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, జెండర్ వివరాలు కచ్చితంగా ఒకేలా ఉండాలి. ఏ ఒక్క అక్షరం మారినా యూపీఐ వేరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. అలాగే పాన్ కార్డు లింక్ కాకపోతే పీఎఫ్ విత్ డ్రాయల్స్ పై ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. 3. బ్యాంక్ ఖాతా వివరాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి నేరుగా మీ బ్యాంక్ ఖాతాకే వస్తాయి. కాబట్టి, ఈపీఎఫ్ఓ పోర్టల్ లో నమోదైన మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కచ్చితంగా ఉండాలి. ఆ అకౌంట్ మీ పేరు మీదే ఉండాలి. ప్రస్తుతం రన్నింగ్ లో ఉండాలి. పాత జీతాల అకౌంట్లు, క్లోజ్ అయిన అకౌంట్లు లేదా పేరు సరిపోలని జాయింట్ అకౌంట్లు ఉంటే వెంటనే మార్చుకోండి. అలాగే మీ ప్రైమరీ యూపీఐ ఐటీ యాక్టివ్ గా ఉందో లేదో చూసుకోవాలి. 4. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలియూపీఐ ద్వారా పీఎఫ్ బదిలీ ప్రక్రియ పూర్తిగా ఓటీపీ ఆధారిత సెక్యూరిటీతో ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్, మీ యూఏఎన్ కు రిజిస్టర్ అయిన నంబర్, మీ యూపీఐ యాప్ లో వాడుతున్న నంబర్, ఈ మూడు వీలైనంత వరకు ఒకటే ఉండాలి. ఆ నంబర్ యాక్టివ్ గా ఉంటేనే ఓటీపీలు సకాలంలో వచ్చి ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. 5. సర్వీస్ హిస్టరీ, ఇ-నామినేషన్మీరు గతంలో వేరు వేరు కంపెనీల్లో పని చేసి ఉంటే, పాత కంపెనీల తాలూకు పీఎఫ్ ఖాతాలన్నింటినీ ప్రస్తుతమున్న యాక్టివ్ యూఏఎన్ లోకి మెర్జ్ చేసుకోవాలి. పాత కంపెనీల వారు మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ను పోర్టల్ లో సరిగ్గా అప్డేట్ చేశారో లేదో చూసుకోవాలి. వీటితో పాటు మీ ఈ-నామినేషన్ అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. పెళ్లయిన వారు లేదా డిపెండెంట్లు మారిన వారు తమ నామినీ వివరాలను వెంటనే సవరించుకోవాలి.