‘ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను చూస్తుంటే బాధగా ఉంది’.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) నూతన కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 14 మందిని సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీఎస్ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి. భరత్ భూషణ్‌, వైస్ చైర్మన్‌గా దర్శకుడు మెహర్ రమేష్ కుమార్ లను ఎంపిక చేస్తూ ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఆదివారం APFDC నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''1975లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలో ఏర్పాటైన ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు అంబికా కృష్ణ చైర్మన్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ బోర్డుకి నూతన కార్యవర్గం ఎపికైంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్.. మేమంతా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'' అని అన్నారు.''ఆనాడు చలన చిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా విజయవాడ బాసిల్లింది. ఇప్పటికీ అలానే ఉంది. మామూలుగానే ఆంధ్ర రాష్ట్రం నుంచి సినిమాలకు కలెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఏ సినిమాకైనా 60 - 70 శాతం వసూళ్లు ఇక్కడి నుంచే వస్తాయి. ఏపీలో సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నా సినిమాలు షూటింగ్‌లు జరుపుకొన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి సహా అనేక ప్రాంతాల్లో షూటింగులు చేశాను. 'అఖండ 2' షూటింగ్ రంపచోడవరంలో జరిగింది. ఇక్కడి వాతావరణం, ప్రజల సహకారం షూటింగ్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి''''ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ను మళ్లీ యాక్టీవేట్ చేయడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణను రూపొందించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిరాటంకంగా షూటింగులు చేసుకునేలా ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. సినిమా పర్మిషన్స్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ వరకూ.. అన్ని అనుమతులు ఇవ్వడం, రాయితీలు ఇవ్వడం గురించి అందరం కూర్చొని మాట్లాడుకొని కార్యాచరణ రూపొందిస్తాం. అతి వేగంగా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం''''ప్రస్తుతం సినిమాను బతికించాల్సిన పరిస్థితుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉంది. దానికి కారణాలు ఏవైనా.. సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ సినిమాలు రావాలి. అందరూ మంచి సినిమాలు చేయాలి. అనుకరణ లేకుండా, మన సత్తాకు పదును పెడుతూ మంచి సందేశాత్మక చిత్రాలనుం ప్రజలకు అందజేయాలి. టెక్నిక్ లేనప్పుడే సినిమాలు శీఘ్రంగా పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయినా చాలా ఆసల్యంగా సినిమాలు పూర్తవుతున్నాయి. ఇవాళ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను చూస్తుంటే బాధగా ఉంది. వారిలో కొందరు థియేటర్లకు తాళాలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు''''ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఆడుకోడానికి, సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం తగిన కృషి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని తప్పక కోరతాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో విజయవాడను సినీ ఇండస్ట్రీకి రాజధాని అని చెప్పుకునేవారు. కాబట్టి ఇక్కడ కూడా తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నంది పురష్కారాలతో సహా అనేక అంశాలను పునరుద్దించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సినిమాటోగ్రఫీ శాఖ భుజాలపై ఉందని తెలియజేసుకుంటున్నా. ఎక్కువ సినిమాలు చేయాలి. థియేటర్లు, ప్రేక్షకులకు సినిమాలు అందించాలి. కష్టాలు వచ్చినప్పుడు అందరం ఒక కుటుంబంలా కలిసి సమస్య పరిష్కరించి, ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలి'' అని బాలయ్య అన్నారు.