MI vs RR మ్యాచ్‌లో హై డ్రామా.. ఆఖర్లో ట్విస్ట్, ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్!

Wait 5 sec.

ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో హై డ్రామా నెలకొంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన ముంబై మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ని తన వైపు తిప్పుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కుంగ్‌ఫూ పాండ్యాగా మారి కాసేపు మెంటల్ మాస్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. ఇక మ్యాచ్ ముంబైదే అనుకున్న సమయంలో హార్దిక్ వికెట్ కోల్పోవడం.. ఆఖర్లో వరుస వికెట్లు పడటంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ నేరుగా ప్లే ఆఫ్స్‌కి వెళ్లగా.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఆరంభంలోనే అవుట్ కావడం.. మిడిలార్డర్ విఫలం కావడంతో కనీసం 200 కూడా చేయలేరేమో అనిపించింది. కానీ ఆఖర్లో జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ అందించిన భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే నమన్ ధీర్ (6), ర్యాన్ రికెల్టన్ (12), తిలక్ వర్మ (3) కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును సూర్యకుమార్ యాదవ్ - విల్ జాక్స్ కలిసి ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 38 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విల్ జాక్స్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. జాక్స్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. క్రీజులో ఉన్నంతసేపూ సిక్సర్లు, ఫోర్లతో ముంబై ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. హార్దిక్ 15 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుటవ్వడంతో మ్యాచ్ మళ్లీ రాజస్థాన్ వైపు తిరిగింది. హార్దిక్ అవుటైన వెంటనే కార్బిన్ బాష్ కూడా వికెట్ కోల్పోయాడు. వరుస వికెట్లు పడటం ఆఖర్లో రన్‌రేట్ పెరగడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. 18వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ మిస్ హిట్‌తో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. సూర్య 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ 206 పరుగుల టార్గెట్ ముందు 175కే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. ముంబై ఇండియన్స్ సీజన్‌లో పదో ఓటమిని అందుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.