E = mc2 ఫార్ములా అన్నం పెట్టదు.. 90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్

Wait 5 sec.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భవిష్యత్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలనేది వివరించారు. ఆయన తన '' పాడ్ కాస్ట్ లో తాజాగా 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే టాపిక్ మీద మాట్లాడారు. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెంచుతూ వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు. కేవలం పుస్తక జ్ఞానం కంటే కూడా జీవన నైపుణ్యాలు, క్రమశిక్షణ, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించే విద్యావ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుండే నైతిక విలువలు, మానసిక స్థైర్యం, సమాజం పట్ల బాధ్యతను అలవరిస్తేనే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పూరీ తెలిపారు. ''ఇవాళ ఉన్న మోడర్న్ స్కూల్స్ అన్నీ పిల్లలకు అపారమైన నాలెడ్జ్ అందిస్తున్నాయి. అయితే ఆ నాలెడ్జ్.. విద్యార్థిని స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్స్ (బలమైన వ్యక్తులు)లా తయారు చేయడానికి ఉపయోగపడదు. మన దేశానికి కావాల్సింది క్యారెక్టర్, క్రమశిక్షణ, ఎమోషనల్ బ్యాలెన్స్, రెస్పాన్సిబిలిటీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న యువత కావాలి. LKG నుండే వాళ్ళకి ఇంటి పనులు ఎలా చేసుకోవాలో స్కూల్లో నేర్పించాలి. పరిశుభ్రత గురించి చెప్పాలి. ఐదేళ్ల వయసుకే సమయపాలన, నిజాయతీ అంటే ఏంటో నేర్పాలి. అంతేకాదు ప్రతి స్టూడెంట్ లో క్రమశిక్షణ నర నరాల్లో నూరుపోయాలి. వాళ్ళకి కుకింగ్ క్లాసెస్ కూడా ఉండాలి. జీవితానికి పనికొచ్చే సర్వైవల్ స్కిల్స్ అందరికీ నేర్పాలి. వ్యాయామాలు, ఆటలు తప్పనిసరిగా అలవాటు చేయాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్ గురించి చెప్పాలి. స్క్రీన్ అడిక్షన్ తగ్గేలా చూడాలి. ఇంటర్నెట్ ముని ఎలా వాడుకోవాలో నేర్పించాలి''''ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ మార్క్స్, ఎగ్జామ్స్, కాంపిటీషన్, మెమరైజేషన్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి, వాళ్ళు నేర్పే ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే ముందు సెల్ఫ్ కంట్రోల్, టైం మేనేజ్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్.. ఇలాంటి వాటి గురించి పాఠాలు ఉండాలి. ఇవే వాళ్ళకి జీవితంలో పనికొస్తాయి. రెస్పెక్ట్, ఎథిక్స్, మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ హెల్త్, ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ కంట్రోల్, స్పీచ్ అండ్ బిహేవియర్.. వీటి గురించి క్లాసెస్ ఉండాలి. వారానికి ఒకసారి వాళ్ళని మెడిటేషన్ లో కూర్చోబెట్టాలి. కొంచెం ఎదిగాక ఒత్తిడి(స్ట్రెస్) ఎలా హ్యాండిల్ చేయాలి, కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పాలి. జీవితంలో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో చెప్పి, ప్రతి ఒక్కరు కనీసం మూడు భాషలైనా నేర్చుకునేలా చూడాలి''* ''యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ అవేర్నెస్, సైకలాజికల్ వెల్ బీయింగ్.. ఇలాంటి మెంటల్ హెల్త్ కోర్సెస్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఈ నేచర్ ఎంత ముఖ్యమో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. వీటి తర్వాతే వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఉండాలి. మీరు గమనిస్తే మనం చదివిన చదువుకి, బతికే బతుక్కి సంబంధం ఉండదు. e = mc2 అన్నం పెట్టదు. న్యూటన్, ఐన్ స్టీన్ వచ్చి మన రెంట్ కట్టరు. క్వాంటం మెకానిక్స్ కంటే మనకు కావాల్సింది బతకడానికి పనికొచ్చే చదువు''''జీవితంలో ఏదైనా కష్టం ఎదురైతే, స్కూల్లో చెప్పిన మోటివేషన్ క్లాస్ గుర్తుకు రావాలి. అందుకే పిల్లల్ని మోటివేట్ చేసే మాస్టర్స్ కావాలి. టీచర్స్, లెక్చరర్స్ కూడా స్టూడెంట్స్ కి రోల్ మోడల్స్ లా ఉండాలి. ఈ రోజుల్లో డిగ్రీ వరకు చదివిన ఏ చదువైనా, అది కేవలం బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఆ డిగ్రీలతో వాళ్ళ జీవితాలు ఏమీ మారిపోవు. దానికోసం చిన్నప్పటి నుంచే మోయిలేనంత పుస్తకాలు వాళ్ళ నెత్తిన పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ కోసం, మార్కుల కోసం వాళ్ళని అనుక్షణం ఒక కాంపిటీషన్ మోడ్లో పెట్టడం మంచిది కాదు. దీని వలన పిల్లలు చిన్నప్పుడే యాంగ్జైటీకి లోనవుతున్నారు''''నువ్వు 90% మార్కులతో డిగ్రీ పాస్ అయినా సరే బయట పొడిచేది ఏమీ లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ అండ్ బ్యూరో లెక్కల ప్రకారం, ప్రతి ఏడాది మన దేశంలో దాదాపు 13,000 నుంచి 15,000 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అకాడమిక్ ఒత్తిడి, ఓటమి భయం, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇందుకు ప్రధాన కారణాలు. ఇన్ని వేల మంది చనిపోతున్నారు అంటే, వాళ్ళ మానసిక పరిస్థితి గురించి ఆలోచించండి. దీనికి కారణం ఎడ్యుకేషన్ సిస్టం, తల్లిదండ్రులు. మీ కొడుకు కలెక్టర్ అవ్వకపోయినా నష్టం ఏమి లేదు. అత్యధిక మార్కులు వచ్చినవాళ్ళ కంటే, ఎగ్జామ్ ఫెయిల్ అయినవాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ దేశంలో''''ఏదైనా మన ఎడ్యుకేషన్ మారాలి.. మన పిల్లల పర్సనల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అవ్వాలి. అంతే కాదు వాళ్ళకి ఫ్రీడమ్ గురించి చెప్పాలి. దాని వాల్యూ గురించి చెప్పాలి. ఫ్రీడమ్ ని ఎలా దుర్వినియోగం చేయకూడదో చెప్పాలి. పోలీస్ ఆఫీసర్స్ ని కాలేజీ కి పిలిచి విద్యార్థులకు సివిక్ సెన్స్ నేర్పాలి. డిగ్రీ తర్వాత కంపల్సరీగా ఒక ఏడాది మిలిటరీలో పెట్టగలిగితే ఇంకా మంచిది. ఒక యూనివర్సిటీ నుండి ఒక స్టూడెంట్ బయటికి వస్తున్నాడు అంటే.. వాడు పర్ఫెక్ట్ మెంటల్ ఫిట్నెస్ తో వస్తున్న భావి భారత పౌరుడై ఉండాలి తప్ప, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి పోలీస్ స్టేషన్ లో కూర్చోకూడదు. చదువు కంటే ముఖ్యం సంస్కారం. అందుకే పిల్లలకి సంస్కారం, మనోస్థైర్యం నేర్పే ఎడ్యుకేషన్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని పూరీ జగన్నాథ్ అన్నారు.