ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ 204 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉన్న ఏపీకి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో వీరిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఎయిర్‌పోర్టులతో పాటుగా పోర్టులు, రోడ్డు మార్గాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎవరిలోనైనా ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఎయిర్ పోర్టులలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. విమాన ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఎవరిలోనైనా ఎబోలా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే అలాంటి వారిని క్వారంటైన్ తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు గతంలో తెలిసిందే. ఈ వైరస్ అనుభవాలతో ఎబోలా వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న విశాఖ, తిరుపతి, విజయవాడ వంటి చోట్ల ఐసోలేషన్ వార్డులను కూడా సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. బోధనా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని.. అవసరమైన పీపీఈ కిట్లు, పరీక్షా కిట్లు అందుబాటులో ఉంచినట్లుమంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎబోలా వైరస్ గురించి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్‌లకు అవగాహన కల్పిస్తున్నామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. అత్యవసరం అయితే తప్ప ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు కూడా తమ ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని.. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.