టాలీవుడ్ మెగాస్టార్ , దివంగత దిగ్గజ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ ఫ్యామిలీల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. రాజ్‌ కుమార్‌ మరణించిన తర్వాత కూడా ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం అలానే కొనసాగుతూ వస్తోంది. అప్పట్లో చిరు - రాజ్‌ కుమార్‌ కలిసి యాక్ట్ చేయలేదు కానీ.. ఇప్పుడు వారి వారసులు కలిసి నటించారు. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా.. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా చెర్రీ - శివన్న కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఐకానిక్ మూమెంట్ ని రీక్రియేట్‌ చేశారు.ఇటీవల బెంగుళూరులో 'పెద్ది' మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్, శివరాజ్‌ కుమార్‌, జాన్వీ కపూర్‌ కలిసి స్పెషల్‌ చిట్‌చాట్‌ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం చిరంజీవి - రాజ్‌ కుమార్‌ లకి సంబంధించిన ఫోటోను యాంకర్ చూపించింది. అప్పుడు చిరుని రాజ్‌ కుమార్‌ ముద్దు పెట్టుకున్నారని, కానీ కరెక్ట్ గా ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేయలేకేపోయారని చెప్పింది. అయితే ఆ సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేయమని శివరాజ్‌ కుమార్‌ - చరణ్‌లను రిక్వెస్ట్ చేసింది. చిరంజీవి - రాజ్‌ కుమార్‌ ఫోటోని యాంకర్ చూపించడంతో, వెంటనే చెర్రీ - శివన్నలు దాన్ని రీక్రియేట్‌ చేసి చూపించారు. రామ్ చరణ్ ను శివరాజ్ కుమార్ ప్రేమగా హగ్‌ చేసుకుని, ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగాస్టార్ - శివరాజ్ కుమార్ ఫ్యామిలీల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది ఈ స్టిల్స్ చూస్తే అర్థమవుతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. యాంకర్ చూపించిన ఆ ఫొటో.. రాజ్‌ కుమార్‌ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్‌ నిర్మాణ సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో తీసిందని తెలుస్తోంది.